Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలితగా విద్యాబాలన్.. భారీ బడ్జెట్‌తో 'అమ్మ అంటే ప్రేమ'

Webdunia
శుక్రవారం, 14 డిశెంబరు 2018 (08:59 IST)
దివగంత సినీ నటి, అన్నాడీఎంకే శాశ్వత ప్రధాన కార్యదర్శి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా మరో చిత్రం తెరకెక్కనుంది. ఇప్పటికే ఆమె పేరుతో "ది ఐరన్ లేడీ" అనే పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో జయలలితగా నిత్యామీనన్ నటిస్తుండగా, ఈ చిత్రానికి ప్రియదర్శిని దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే, ప్రముఖ దర్శకుడు భారతీ రాజా దర్శకత్వంలో కూడా మరో చిత్రం తెరకెక్కనుంది. 
 
ఇదిలావుంటే, భారీ చిత్రాలు నిర్మించే లైకా ప్రొడక్షన్ మరో చిత్రాన్ని నిర్మించనుంది. ఈ చిత్రానికి ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించనున్నారు. ఇందులో జయలలిత పాత్రను విద్యాబాలన్ పోషించనుంది. ఇప్పటికే స్క్రిప్టులు పూర్తికాగా, మిగిలిన పాత్రల కోసం పలువురు సినీ ప్రముఖుల ఎంపిక జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో ప్రముఖ హీరో అవింద్ స్వామి అత్యంత కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. 
 
ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన జయలలిత పుట్టినరోజైనా ఫిబ్రవరి 24వ తేదీన వెల్లడయ్యే అవకాశం ఉంది. పైగా, ఈ చిత్రానికి "అమ్మా ఎండ్రాల్ అన్బు" (అమ్మ అంటే ప్రేమ) అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టు వర్క్ పూర్తికావడంతో 2019 డిసెంబరు నాటికి చిత్ర షూటింగ్ పూర్తి చేసి జయలలిత పుట్టినరోజైన 2020 ఫిబ్రవరి 24వ తేదీన సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Woman: భర్తపై కోపం.. నాలుకను కొరికి నమిలి మింగేసిన భార్య

కాచిగూడ రైల్వే స్టేషనులో వాంతులు, ఇంటికెళ్లి సూసైడ్ చేసుకున్న మహిళా టెక్కీ

Woman: పల్నాడులో ఘోరం.. భర్తను బంధువులతో కలిసి చంపి డోర్ డెలివరీ చేసిన భార్య

రాజమండ్రి సెంట్రల్ జైల్లో వున్న కుమారుడు మిథన్ రెడ్డికి పెద్దిరెడ్డి భోజనం (video)

మహిళ పర్సును కొట్టేసిన దొంగలు.. ఏటీఎం కార్డుతో రూ.40వేలు దొంగలించారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments