Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రివిక్రమ్, నితిన్, సమంతల కాంబోలో అ.. ఆ.. టీజర్ రిలీజ్!

Webdunia
గురువారం, 14 ఏప్రియల్ 2016 (15:21 IST)
త్రివిక్రమ్, నితిన్, సమంత ల కాంబినేషన్‌లో ''హారిక అండ్ హాసిని క్రియేషన్స్'' చిత్రం ‘అ ఆ’ (‘అనసూయ రామలింగం’ వర్సెస్ ‘ఆనంద్ విహారి’ అన్నది ఉప శీర్షిక). *మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంతల కాంబినేషన్‌లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ రూపొందిస్తున్న ఈ చిత్రం టీజర్ నిన్న సాయంత్రం 5 గంటల 2 నిమిషాలకు విడుదల చేశారు. ప్రపంచ వ్యాప్తంగా నెటిజన్స్ ప్రసంశలందుకుంది ఈ 'అ ఆ' టీజర్. 
 
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) మాట్లాడుతూ 'ఈ 'అ ఆ' టీజర్ అందరి మన్ననలు అందుకోవటం ఎంతో ఆనందం గా ఉంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలం నుండి జాలువారిన ఒక మంచి ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామాను ప్రేక్షకులు మేలో చూడబోతున్నారు అని నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ సందర్భం గా తెలిపారు. చిత్రం ఆడియోను ఈ నెలలోనే విడుదల చేయనున్నామని తెలిపారు. మిక్కి.జె.మేయర్ సంగీతం సంగీత ప్రియులను ఆకట్టుకుంటుందని వెల్లడించారు.
 
ప్రపంచ వ్యాప్తంగా మే నెల ప్రధమార్థంలో 'అ ఆ' విడుదల అవుతుందని తెలిపారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ తొలిసారిగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయన సరసన సమంత నాయికగా తొలిసారిగా నటిస్తున్నారు. మరో కథానాయికగా ‘అనుపమ పరమేశ్వరన్’ (మలయాళ చిత్రం ‘ప్రేమమ్’ ఫేం) నటిస్తున్నారు. ఇతర ప్రధాన పాత్రలలో నదియ, అనన్య, ఈశ్వరీ రావు, సన, గిరిబాబు, పోసాని, నరేష్, రావురమేష్, అవసరాల్ శ్రీనివాస్, ప్రవీణ్,రఘుబాబు, పమ్మి సాయి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు నటిస్తున్నారు.
 
ఈ చిత్రానికి సంగీతం-మిక్కి.జె.మేయర్ , కెమెరా- నటరాజ్ సుబ్రమణియన్, ఆర్ట్- ఎ.ఎస్.ప్రకాష్, ఎడిటింగ్ -కోటగిరి వెంకటేశ్వర రావు, సౌండ్ డిజైనర్- విష్ణు గోవింద్, శ్రీ శంకర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్- పి.డి.వి. ప్రసాద్, సమర్పణ శ్రీమతి మమత నిర్మాత- సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కథ-మాటలు -స్క్రీన్ ప్లే-దర్శకత్వం- త్రివిక్రమ్.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments