విక్టరీ వెంకటేష్...తేజ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో స్టార్ట్ చేయనున్నారు. ఈ చిత్రానికి ''ఆట నాదే వేట నాదే'' అనే టైటిల్ ఖరారు చేసినట్టు సమాచారం. వెంకటేష్ ప్రొఫెసర్‌గా నటిస్తున్నట్టు
విక్టరీ వెంకటేష్...తేజ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో స్టార్ట్ చేయనున్నారు. ఈ చిత్రానికి ''ఆట నాదే వేట నాదే'' అనే టైటిల్ ఖరారు చేసినట్టు సమాచారం. వెంకటేష్ ప్రొఫెసర్‌గా నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని సురేష్ బాబు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇదిలాఉంటే.. ఈ సినిమాలో వెంకటేష్ లుక్ అంటూ ఓ స్టిల్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
ఈ స్టిల్లో వెంకటేష్ బ్యాగు, బుక్స్ పట్టుకుని స్టైల్‌గా ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే... ఈ స్టిల్లో వెంకీ లుక్ సూపర్ అనేలా ఉంది. సోషల్ మీడియాలో ఈ స్టిల్ వైరల్ అయ్యింది. వెంకీ సరసన శ్రియ నటిస్తోంది. యువ హీరో నారా రోహిత్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. కొత్త, పాత నటీనటులతో తెరకెక్కించే ఈ సినిమా చాలా వైవిధ్యంగా ఉంటుంది అంటున్నారు. నూతన నటీనటులు కోసం తేజ స్వయంగా ఆడిషన్స్ నిర్వహించారు. గురు సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని చేస్తోన్న ఈ సినిమా వెంకీకి మరో విజయాన్ని అందిస్తుందని ఆశిద్దాం.