Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనారోగ్యంతో కోలీవుడ్ దర్శకుడు కన్నుమూత

Webdunia
శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (10:29 IST)
తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం వేట్టైక్కారన్ చిత్ర దర్శకుడు బాబు శివన్ అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. ఆయనకుబార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నిజానికి కరోనా వైరస్ మహమ్మారితో పాటు.. వివిధ అనారోగ్య సమస్యల కారణంగా పలువురు సినీ ప్రముఖులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో తాజాగా బాబు శివన్ చనిపోవడంతో కోలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. 
 
గతంలో హీరో విజయ్‌ నటించిన చిత్రం వేట్టైక్కారన్. ఈ చిత్రంతో ఆయన దర్శకుడిగా పరిచయమయ్యాడు. అలాగే విజయ్‌ హీరోగా ఏవీఎం సంస్థ  నిర్మించిన 'కురివి' చిత్రానికి సంభాషణలు అందించారు. తదుపరి బుల్లి తెరపై దృష్టిపెట్టారు. ఈ క్రమంలో అనారోగ్యానికి గురికావడంతో చెన్నైలోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరి వైద్య చికిత్సలు పొందుతూ వచ్చారు. 
 
కాలేయం, ఊపిరితిత్తులు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న బాబు శివన్‌ వైద్యం ఫలించక బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాబు శివన్‌ మృతితో చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. ఆయన మరణానికి పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రెండు తలల నాగుపాము.. రెండు ఎలుకల్ని ఒకేసారి తినిస్తోంది.. వీడియో వైరల్

Dhee: ఢీ షో డ్యాన్సర్ నన్ను మోసం చేశాడు.. సెల్ఫీ వీడియో ఆత్మహత్య

ASHA Workers: ఆశా వర్కర్లకు భలే ప్రయోజనాలు.. ఏంటవి?

పవన్ కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు... పోసానిపై పోక్సో కేసు? ఇక బైటకు రావడం కష్టమేనా?

Snake: మహా కుంభమేళాలో భారీ సర్పం.. మహిళ ఏం చేసిందంటే? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments