Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ సీజన్ 3.. హోస్ట్‌గా విక్టరీ వెంకటేష్...

Webdunia
మంగళవారం, 1 జనవరి 2019 (15:14 IST)
బిగ్ బాస్ సీజన్ 3పై అప్పుడే చర్చ మొదలైంది. తెలుగులో తొలి బిగ్ బాస్ సీజన్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా, రెండో సీజన్‌కు నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం బిగ్ బాస్-3కి విక్టరీ వెంకటేష్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. గతంలో విజయ్ దేవరకొండ బిగ్ బాస్ సీజన్ -3కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. తాజాగా వెంకీ పేరు తెరపైకి వచ్చింది.
 
ఈ కార్యక్రమ నిర్వాహకులు ఇటీవలే వెంకటేశ్‌తో సంప్రదింపులు జరిపారనేది తాజా సమాచారం. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ కార్యక్రమం పట్ల అంతగా ఆసక్తిని చూపడంలేదనే ఫీడ్ బ్యాక్ వచ్చిందట. అందువలన ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి క్రేజ్ వున్న వెంకటేశ్‌ను హోస్ట్‌గా రంగంలోకి దింపాలనే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారట. 
 
ఇంతకుముందు హౌస్ లోని వాళ్లు నాని మాటలను పెద్దగా లెక్కచేయలేదనే విమర్శలు వున్నాయి. వెంకటేశ్‌ను అనుకోవడానికి ఇదొక కారణమని అంటున్నారు. ఇంతవరకూ టీవీ కార్యక్రమాలకి దూరంగా ఉంటూ వచ్చిన వెంకటేశ్, తొలిసారిగా ఈ కార్యక్రమంతో బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రానున్నాడని టాక్ వస్తోంది. జూన్ నుంచి బిగ్ బాస్ మూడో సీజన్ ప్రారంభం కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొత్త రికార్డు సాధించిన శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం

వాట్సాప్ గవర్నెన్స్‌లో వెయ్యికి పైగా సేవలు.. చంద్రబాబు కీలక నిర్ణయం

వేసవి స్పెషల్ : చర్లపల్లి - తిరుపతికి ప్రత్యేక రైళ్లు

స్కూల్‌లో అగ్నిప్రమాదం - పవన్ చిన్నకుమారుడుకు గాయాలు

అక్రమ సంబంధం.. నిద్రపోతున్న భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments