Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంకటేష్ సైంధవ్ హై ఆక్టేన్ ఎమోషనల్ క్లైమాక్స్ షెడ్యూల్‌ పూర్తి

Webdunia
సోమవారం, 14 ఆగస్టు 2023 (16:05 IST)
Victory Venkatesh
నిర్మాత వెంకట్ బోయనపల్లి తన తొలి చిత్రం ‘శ్యామ్ సింగరాయ్‌’ ని లావిష్ గా నిర్మించి సినిమాపై తనకున్న ప్యాషన్ చూపించారు. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ హీరోగా, ‘హిట్‌’వర్స్ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ‘సైంధవ్ ‘చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు వెంకట్ బోయనపల్లి.
 
‘సైంధవ్’ వెంకటేష్ 75వ మైల్ స్టోన్ మూవీ. మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకొని రాజీపడకుండా నిర్మిస్తున్నారు.  మేకర్స్ 16 రోజులలో కీలకమైన షెడ్యూల్‌ను పూర్తి చేశారు, ఎనిమిది మంది ముఖ్య నటీనటులు షూట్‌లో పాల్గొన్న హై-ఆక్టేన్ ఎమోషనల్ క్లైమాక్స్‌ను హర్ష్ కండీషన్స్ లో చిత్రీకరించారు. యాక్షన్ ఎపిసోడ్‌ను రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ సూపర్ వైజ్ చేశారు. వెంకటేష్‌కి ఇప్పటి వరకు ఇదే మోస్ట్ ఎక్స్ పెన్సివ్  క్లైమాక్స్ పోర్షన్. సినిమా రూపుదిద్దుకుంటున్న తీరు పట్ల చిత్ర బృందం ఆనందంగా ఉంది.
 
నవాజుద్దీన్ సిద్ధిక్, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెర్మియా, సారాతో సహా దాదాపు అన్ని ప్రధాన పాత్రలను మేకర్స్ పరిచయం చేశారు.
 
ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఎస్ మణికందన్ కెమెరామెన్ గా, గ్యారీ బిహెచ్ ఎడిటర్  గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి కిషోర్ తాళ్లూరు సహ నిర్మాత.
 
పాన్ ఇండియా మూవీ సైంధవ్ అన్ని దక్షిణాది భాషలు, హిందీలో డిసెంబర్ 22న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

నా పని నేను చేస్తున్నా.. పోలీసులు వాళ్ళ పని చేస్తున్నారు.. ఆర్జేవీ పరారీపై పవన్ కామెంట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

తర్వాతి కథనం
Show comments