Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంకటేష్, నవాజుద్దీన్ సిద్ధిఖీ చిత్రం సైంధవ్ ఘనంగా ప్రారంభం

Venky  rana  sureshbabu and others
Webdunia
శుక్రవారం, 27 జనవరి 2023 (07:13 IST)
Venky, rana, sureshbabu and others
వెంకటేష్ 75వ ల్యాండ్ మార్క్ చిత్రం ‘సైంధవ’ ఈరోజు హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో కోర్ టీమ్‌తో పాటు పలువురు ప్రత్యేక అతిథుల సమక్షంలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు.  
 
హీరో నాని, రానా దగ్గుబాటి, నాగ చైతన్య, నిర్మాత సురేష్ బాబు, దిల్ రాజు, కె రాఘవేంద్రరావు, నిర్మాతలు మైత్రి నవీన్, శిరీష్, వైరా మోహన్ చెరుకూరి, డా.విజయేందర్ రెడ్డి, ఎకె ఎంటర్టైన్మెంట్స్ అనిల్ సుంకర, పీపుల్ మీడియా విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల, 14 రీల్స్+ గోపీ ఆచంట, దర్శకుడు విమల్ కృష్ణ, షైన్ స్క్రీన్స్ నిర్మాత  సాహు గారపాటి, ఎస్‌ఎల్‌వి సినిమాస్ సుధాకర్ చెరుకూరి, బండ్ల గణేష్, సితార నాగ వంశీ, డైరెక్టర్ బి గోపాల్, ఎంఎస్ రాజు, నిర్మాత బెల్లంకొండ సురేష్, జెమినీ కిరణ్, జీ సినిమాస్ ప్రసాద్ నిమ్మకాయల, రంజిత్ మూవీస్ దామోదర్ ప్రసాద్, క్లాసిక్ సుధీర్, నిజాం శశి చిత్ర ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.
 
రానా దగ్గుబాటి, నాగ చైతన్య,  సురేష్ బాబు స్క్రిప్ట్‌ను మేకర్స్‌కి అందజేశారు. కె రాఘవేంద్రరావు క్లాప్‌బోర్డ్‌ ఇవ్వగా, దిల్‌రాజు కెమెరా స్విచాన్‌ చేశారు. తొలి షాట్‌కి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. సైంధవ్ రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.
 
నిన్న విడుదలైన ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఉన్న వీడియో భారీ అంచనాలను నెలకొల్పింది. సైంధవ్  భారీ స్థాయిలో రూపొందుతుంది. ఇది వెంకటేష్‌ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ చిత్రం.
 
ప్రముఖ నటీనటులు, అత్యున్నత సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు. ఎస్ మణికందన్ కెమెరామెన్ గా, గ్యారీ బిహెచ్ ఎడిటర్  గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి కిషోర్ తాళ్లూరు సహ నిర్మాత.
 
ఇతర నటీనటులను త్వరలో ప్రకటించనున్నారు మేకర్స్. సైంధవ్ అన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతి గారు, మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతా: ఐటిడిపి కిరణ్ (Video)

అప్పుడేమో వరినాటు.. ఇప్పుడు వరిని జల్లెడ పట్టిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ (video)

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments