Webdunia - Bharat's app for daily news and videos

Install App

'వెంకటాపురం' ఫస్ట్ సాంగ్ లాంచ్ చేసిన స్టార్ డైరెక్టర్ వివి వినాయ‌క్‌

గుడ్ సినిమా గ్రూప్ పతాకంపై శ్రేయాస్ శ్రీనివాస్ అండ్ తుము ఫణి కుమార్ నిర్మాతలుగా తెరకెక్కుతోన్న సస్పెన్స్ థ్రిల్లర్ వెంకటాపురం. "హ్యాపీడేస్ ఫేం " యంగ్ హీరో రాహుల్, మహిమా మక్వాన్ జంటగా నటించారు. స్వామిర

Webdunia
మంగళవారం, 28 ఫిబ్రవరి 2017 (15:33 IST)
గుడ్ సినిమా గ్రూప్ పతాకంపై శ్రేయాస్ శ్రీనివాస్ అండ్ తుము ఫణి కుమార్ నిర్మాతలుగా తెరకెక్కుతోన్న సస్పెన్స్ థ్రిల్లర్ వెంకటాపురం. "హ్యాపీడేస్ ఫేం " యంగ్ హీరో రాహుల్, మహిమా మక్వాన్ జంటగా నటించారు. స్వామిరారా, రౌడీఫెలో చిత్రాలకు అసోసియేట్‌గా పనిచేసిన వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫస్ట్‌ సాంగ్‌ను స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ చిత్ర యూనిట్‌ సమక్షంలో లాంచ్ చేశారు.
 
ఇక వెంకటాపురం చిత్రానికి సంబంధించి నిర్మాత అల్లు అరవింద్ చేతుల మీదుగా విడుదలైన ట్రైలర్‌కు సోషల్‌ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. పది లక్షలకు పైగా వ్యూస్‌ మార్క్ దాటింది. ఓ యువతి హత్య నేపథ్యంలో ఊహకందని మలుపులతో ఆద్యంతం ఆసక్తి కరంగా ఆకట్టుకుంది. సరికొత్త కథాంశంలో సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. హీరో రాహుల్ లుక్ కోసం స్పెషల్ కేర్ తీసుకున్నారు. ఇప్పుడు స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ విడుదల చేసిన ఫస్ట్ సాంగ్ కూడా సంగీత ప్రియులను బాగా అలరిస్తోంది. ఈ సాంగ్ సినిమాకు బాగా ప్లస్ అవుతుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. 
 
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో వెంకటాపురం చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అజయ్, జోగిబ్రదర్స్, శశాంక్ ఇతర ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రానిక సంగీతం: అచ్చు, కెమెరా: సాయిప్రకాష్ ఆర్ట్: జె.మోహన్, కెమెరామేన్: సాయి ప్రకాష్, మ్యూజిక్: అచ్చు, ప్రొడ్యూసర్స్: శ్రేయాస్ శ్రీనివాస్ & తుము ఫణి కుమార్, ప్రొడక్షన్ కంట్రోలర్: వాసిరెడ్డి సాయిబాబు, డ్యాన్స్ మాస్టర్: అనీష్ విజ్ఞేష్, అనిత నాథ్, స్టోరీ, డైరెక్టర్: వేణు మాధికంటి. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments