Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవుట్ డోర్ ప్రమోషన్ లో వీరసింహారెడ్డి థియేటర్ స్టాండీస్

Webdunia
శుక్రవారం, 16 డిశెంబరు 2022 (16:27 IST)
Veerasimha Reddy
నందమూరి బాలకృష్ణ మాస్,  యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ వీర సింహారెడ్డి. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ గ్రాండ్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను భారీ కాన్వాస్పై మౌంట్ చేస్తున్నారు. ఈ చిత్రం జనవరి 12, 2023న సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.
 
టాప్ ఫామ్లో ఉన్న ఎస్ థమన్ సంగీతాన్ని అందించాడు ,ఇప్పటివరకు విడుదలైన జై బాలయ్య మరియు సుగుణ సుందరి అనే రెండు సింగిల్స్ స్మాషింగ్ హిట్ గా నిలిచి ట్రెండింగ్ లో కొనసాగుతున్నాయి.
 
ఈ క్రమం లో చిత్ర  బృందం అవుట్ డోర్ ప్రమోషన్ లను ప్రారంభించింది. థియేటర్ స్టాండీలు సిద్ధం చేసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అన్ని థియేటర్లకు పంపుతున్నారు.
 
బ్లాక్ షర్ట్ మరియు లేత గోధుమరంగు రంగు లుంగీతో గంభీరంగా కారు పక్కన నడుస్తున్న బాలకృష్ణ స్టిల్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ ఐకానిక్ స్టిల్ ఇప్పటికే మాస్ లో బాగా ప్రాచుర్యం పొందింది మరియు థియేటర్ స్టాండీల పై ఇంకా గొప్పగా కనిపిస్తుంది.
వీరసింహారెడ్డి చిత్రం చివరి పాట మినహా చిత్రీకరణ పూర్తి చేసుకుని సంక్రాంతి కానుక గా విడుదల కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
భారీ అంచనాలున్న ఈ చిత్రం జనవరి 12, 2023న సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments