Webdunia - Bharat's app for daily news and videos

Install App

విక్రమ్ కొత్త చిత్రం విడుదలకు ఉన్న చిక్కులేంటి?

ఠాగూర్
గురువారం, 27 మార్చి 2025 (15:21 IST)
చియాన్ విక్రమ్ కొత్త చిత్రం "వీర ధీర శూర". రెండో భాగం విడుదలకు ముందు చివరి నిమిషంలో న్యాయపరమైన చిక్కులు తలెత్తాయి. దీంతో గురువారం విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదాపడింది. నాలుగు వారాల పాటు సినిమాను విడుదల చేయొద్దంటూ ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. దీంతో గురువారం ఉదయం పడాల్సిన షోలన్నీ రద్దు అయ్యాయి. 
 
ఈ సినిమా విడుదలపై స్టే కోరుతూ ముంబైకు చెందిన ప్రొడక్షన్ కంపెనీ బీఫోర్యూ అనే కంపెనీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. చిత్ర నిర్మాణ సంస్థ తమకు శాటిలైట్ హక్కులను విక్రయించిందని, ఆ ఒప్పందం ప్రకారం విడుదలకు ముందు సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను విక్రయించకూడదని, నిర్మాతలు ఆ నిబంధనలు ఉల్లంఘిస్తూ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను విక్రయించారని తమ పిటిషన్‌లో పేర్కొంది. 
 
ఈ పిటిషన్‌ను పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు ఈ చిత్రం విడుదలపై మధ్యంతర స్టే విధించింది. సినిమాను ప్రదర్శించరాదు అని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. దాంతో మల్టీప్లెక్స్ స్క్రీన్‌లలో గురువారం ఉదయం షెడ్యూల్ చేసిన అన్ని షోలను రద్దు చేశారు. తమిళ నిర్మాతల మండలి ఈ ఇష్యూను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టారనీ పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు.. (వీడియో)

ఆగస్టు 10-12 తేదీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు

బంధువుల పెళ్లిలో కేంద్ర మంత్రి రామ్మోహన్ స్టెప్పులు (Video)

శ్రీవారికి 2.5 కేజీల బంగారంతో శంకు చక్రాలు... ఆ దాత ఎవరో తెలుసా?

చుట్టూ తోడేళ్లు మధ్యలో కోతిపిల్ల, దేవుడిలా వచ్చి కాపాడిన జీబ్రా (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం