Webdunia - Bharat's app for daily news and videos

Install App

#GaddalakondaGanesh గా మారిన వాల్మీకి... అయినా ముగియని వివాదం

Webdunia
శుక్రవారం, 20 సెప్టెంబరు 2019 (10:41 IST)
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ - హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "వాల్మీకి". 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌పై గోపీ ఆచంట, రామ్‌ ఆచంట నిర్మించిన ఈ చిత్రం టైటిల్ విష‌యంలో గత కొద్ది రోజులుగా వివాదం న‌డుస్తోంది. వాల్మీకి టైటిల్‌కి గ‌న్ ఉంచ‌డంపై బోయ హక్కుల పోరాట సమితి మండిప‌డింది. సినిమా టైటిల్ మార్చాల‌ని హైకోర్ట్‌లో పిటీష‌న్ కూడా వేసింది. దీంతో టైటిల్ మార్చాల‌ని చిత్ర‌బృందానికి హైకోర్ట్ నోటీసులు పంప‌డంతో 'వాల్మీకి' చిత్ర టైటిల్‌ని "గద్దలకొండ గణేశ్"గా మారుస్తున్నట్టు హ‌రీష్ శంక‌ర్ ప్రెస్‌మీట్ ద్వారా తెలిపారు. 
 
అయితే ఈ వివాదం ఇంకా ముగిసిన‌ట్టు క‌నిపించ‌డం లేదు. పేరు మార్చిన‌ట్టు ప్రచారం మాత్ర‌మే చేస్తున్నారు. సెన్సార్ బోర్డ్ స‌ర్టిఫికెట్స్‌తో పాటు మిగ‌తా వాటిలో వాల్మీకి అనే ఉంది. ఆ పేరు మార్చే వ‌ర‌కు ఆందోళ‌న కొన‌సాగిస్తాం అని 'వాల్మీకి' సంఘం నేత‌లు అంటున్నారు. దీనిపై హ‌రీష్ శంక‌ర్ ఎలా స్పందిస్తాడో చూడాలి. త‌మిళ సూప‌ర్ హిట్ చిత్రం జిగ‌ర్తాండ‌కి రీమేక్‌గా "గద్దలకొండ గణేశ్" చిత్రం తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. ఇందులో నితిన్ ముఖ్య పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments