Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరుణ్ తేజ్ మట్కా పవర్ ప్యాక్డ్ రిలీజ్ న్యూ పోస్టర్

డీవీ
మంగళవారం, 15 అక్టోబరు 2024 (17:41 IST)
Varun tej new look
వరుణ్ తేజ్ మూవీ 'మట్కా' రిలీజ్ కు రెడీగా వుంది. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్,  SRT ఎంటర్‌టైన్‌ మెంట్స్‌ పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు కూడా జోరందుకున్నాయి. ఫస్ట్ సింగిల్ లే లే రాజా చార్ట్ బస్టర్ రెస్పాన్స్ తో మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి.
 
నవంబర్ 14న సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. తాజాగా మేకర్స్ 'మట్కా' 30 డేస్ కౌంట్ డౌన్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. వరుణ్ తేజ్ సోఫాలో కూర్చుని ఒక చేతిలో గన్, మరో చేతిలో సిగరెట్ తో కనిపించిన పోస్టర్ అదిరిపోయింది. 'వైలెన్స్ విత్ విజన్' అనే క్యాప్షన్ తో ప్రజెంట్ చేసిన ఈ పోస్టర్ లో వరుణ్ తేజ్ వింటేజ్ అవతార్ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.    
 
మట్కా వరుణ్ తేజ్ మోస్ట్ ఎక్స్ పెన్సీవ్ మూవీ. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం జివి ప్రకాష్ కుమార్ అందించగా, ఎ కిషోర్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్.
 
తారాగణం: వరుణ్ తేజ్, నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి, నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్, తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments