జూన్ 9 న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం ఫిక్స్

Webdunia
శుక్రవారం, 2 జూన్ 2023 (13:54 IST)
Mister movie
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమించు కుంటున్నారని కొంతకాలంగా వార్తలు వచ్చాయి. అయితే ఆతర్వాత ఇద్దరు మాల్ దీప్ లో కెమెరాకు చిక్కారు. దాంతో ఇద్దరు డేటింగ్‌లో ఉన్నారని తెలిసింది. గత కొద్దిరోజులుగా  పెళ్లి  చేసుకోబుతున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై మీడియా నాగబాబును ఫోన్ లో కొందరు సంప్రదించారు.వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం కరెక్ట్. కానీ మేము మంచి రోజు చూసి చెపుతాము అని అన్నారు. దాంతో అసలు విషయం బయటపడింది.
 
తాజా సమాచారం మేరకు జూన్ 9 న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం జరగనుంది. హైద్రాబాద్లో నాగబాబు ఇంటిలోనే కొద్దిమంది సమక్షంలో జరుగనున్నది.  పెళ్లి తేదీ ఖరారు కాలేదని సన్నిహితులు చెబుతున్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ కు బాగా ఇష్టమైన వాడు వరుణ్ తేజ్. 
 
2017లో మిస్టర్ అనే సినిమాలో  లావణ్య త్రిపాఠి,  వరుణ్ తేజ్ కలిసి నటించారు. ఆతర్వాత అంతరిక్షం అనే సినిమాలో నటించారు.  అక్కడే వీరి ప్రేమ పరవళ్లు దాటింది. వీరి విషయంలో కొణిదెల కుటుంబం మొత్తం థ్రిల్‌గా ఉందని సన్నిహితులు తెలిపారు. లావణ్య త్రిపాఠి (32), వరుణ్ తేజ్ (36) ఇద్దరు విదేశాలనుంచి నేడే హైదరాబాద్‌కు తిరిగి వచ్చినట్లు తెలిసింది.
 
లావణ్య త్రిపాఠి ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో జన్మించింది. ఆమె తండ్రి హైకోర్టు న్యాయవాది, ముంబైకి వెళ్ళి రిషి దయారాం నేషనల్ కాలేజీలో ఆర్థికశాస్త్రంలో పట్టా పుచ్చుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మొంథా తుఫాను ప్రభావం తగ్గకముందే.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన.. మళ్లీ?

శ్వేతనాగుకు ఆపరేషన్.. పడగకు గాయం అయ్యింది.. వీడియో వైరల్ (video)

Ambassador Car: పాత అంబాసిడర్ కారు పక్కన ఫోజులిచ్చిన చంద్రబాబు.. ఫోటోలు వైరల్ (video)

Anchor Shyamala: కర్నూలు బస్సు ప్రమాదం: 27 మంది వైఎస్‌ఆర్‌సిపి సభ్యులపై కేసు

AP: శ్రీశైలం నుండి విద్యుత్ కోసం తెలంగాణ వాటర్ తీసుకోవద్దు.. ఏపీ విజ్ఞప్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments