Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిన్న వెంకీ.. నేడు నాగశౌర్య... మరో మల్టీస్టారర్ మూవీకి మెగా హీరో ఓకే

Webdunia
బుధవారం, 23 జనవరి 2019 (12:49 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో మల్టీస్టారర్ ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోలు కుర్ర హీరోలతో కలిసి నటించేందుకు అమితాసక్తిని చూపుతున్నారు. తాజాగా విక్టరీ వెంకటేష్, యువ హీరో వరుణ్ తేజ్‌లు కలిసి నటించిన చిత్రం "ఎఫ్2". ఈ చిత్రం మంచి సక్సెస్‌ను సాధించి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. 
 
ముఖ్యంగా 'ఎఫ్2' చిత్రంలో వెంకటేష్ - వరుణ్‌లు తోడల్లుళ్లుగా నటించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. అయితే ఇప్పుడు వ‌రుణ్ తేజ్ మ‌రో మ‌ల్టీ స్టార‌ర్ చేసేందుకు సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తుంది. 
 
అల్లు అర్జున్ హీరోగా వచ్చిన "డీజే" (దువ్వాడ జగన్నాథం) చిత్రం త‌ర్వాత ఏ ఒక్క సినిమాని ప‌ట్టాలెక్కించ‌ని హ‌రీష్ శంక‌ర్ త్వ‌ర‌లో కోలీవుడ్ సూప‌ర్ హిట్ మూవీ 'జిగ‌ర్ తాండా' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌బోతున్నారు. థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మించ‌నుంది.
 
త‌మిళంలో సిద్ధార్ధ్, బాబీ సింహాల పాత్ర‌ల‌ని తెలుగులో నాగ శౌర్య‌, వ‌రుణ్ తేజ్‌లు పోషించ‌నున్నార‌ని అంటున్నారు. తెలుగు నేటీవిటికి త‌గ్గ‌ట్టుగా హ‌రీష్ శంక‌ర్ స్క్రిప్టుని సిద్ధం చేసుకోగా వ‌చ్చే నెల‌లో ఈ ప్రాజెక్ట్‌ సెట్స్ పైకి వెళ్ల‌నుంద‌ట‌. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హష్ మనీ కేసు.. డొనాల్డ్ ట్రంప్ దోషే.. కానీ శిక్ష లేదు.. నేర చరిత్రతో పదవిలోకి?

ఫిబ్రవరి 10 నుండి 11 వరకు ఫ్రాన్స్‌లో ఏఐ సదస్సు.. హాజరు కానున్న ప్రధాని

రిఫ్రిజిరేటర్‌లో మహిళ మృతదేహం.. చీర కట్టుకుని, ఆభరణాలు ధరించి, మెడకు ఉచ్చు..

Sankranthi: సంక్రాంతి రద్దీ.. టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్

తెలంగాణలో క్రిప్టోకరెన్సీ మోసం.. రూ.95 కోట్ల మోసం.. వ్యక్తి అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments