Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరుణ్ తేజ్ కొత్త చిత్రం టైటిల్ ఇదే... క్రేజీ సినిమాలో రష్మిక..

Webdunia
సోమవారం, 14 ఆగస్టు 2023 (14:47 IST)
వరుణ్‌ తేజ్‌ కథానాయకుడిగా శక్తి ప్రతాప్‌ సింగ్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఎయిర్ ఫోర్స్‌ కథాంశంతో సిద్ధమవుతోన్న ఈ సినిమా టైటిల్‌ను చిత్రబృందం సోమవారం ప్రకటించింది. బిగ్గెస్ట్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ అనే టైటిల్‌ ఫైనల్‌ చేశారు. తెలుగు, హిందీ భాషల్లో డిసెంబర్‌ 8న ఇది విడుదల కానుంది. మానుషి చిల్లార్‌ కథానాయిక.
 
అలాగే, ‘విరూపాక్ష’తో ఈ ఏడాది విజయాన్ని అందుకున్నారు దర్శకుడు కార్తిక్‌ దండు. సుకుమార్‌ రైటింగ్స్‌ - శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర (ఎస్‌వీసీసీ) సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. కాగా, ‘విరూపాక్ష’ మేకర్స్‌ ఇప్పుడు మరో ప్రాజెక్ట్‌ కోసం కలిశారు. మైథలాజికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి కార్తిక్‌ దర్శకత్వం వహించనున్నారు. సుకుమార్‌ రైటింగ్స్‌ - ఎస్‌వీసీసీ సంయుక్తంగా దీన్ని నిర్మించనున్నాయి. ప్రీ ప్రొడెక్షన్‌ వర్క్స్‌ కూడా మొదలయ్యాయి. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ ఎన్నికల ఫలితాలు.. రాజకీయాలు వద్దు.. హిమాలయాలకు జగన్?

ఇంటి వద్దకే ఫించన్.. భారతదేశంలో ఇదే తొలిసారి.. చంద్రబాబు అదుర్స్

ఇన్‌స్టాగ్రాంలో పరిచయం, 8వ తరగతి బాలికపై 23 ఏళ్ల యువకుడు అత్యాచారం

హైదరాబాద్ రెస్టారెంట్‌ బిర్యానీలో స్లైడ్ పిన్.. నెట్టింట ఫోటో వైరల్

కాకినాడలో రేషన్ మాఫియా.. సీఐడీ విచారణ జరిపించాలి.. నాదెండ్ల మనోహర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

బరువు తగ్గడం: మీ అర్థరాత్రి ఆకలిని తీర్చడానికి 6 ఆరోగ్యకరమైన స్నాక్స్

రాగులు ఎందుకు తినాలో తప్పక తెలుసుకోవాలి

ఆరోగ్యానికి మేలు చేసే 7 ఆకుకూరలు, ఎలా?

తర్వాతి కథనం
Show comments