Webdunia - Bharat's app for daily news and videos

Install App

''వంగవీటి'' పాటను వర్మే పాడటం మంచిది.. ఆర్జీవీకి సారీ అండ్ థ్యాంక్స్.. సిరాశ్రీ

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తీసిన వంగవీటి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా చుట్టూ వివాదాలు, కేసులు తిరిగాయి. శాండీ, వంశీ చాగంటి, శ్రీతేజ్‌, నైనా గంగూలి, కౌటిల్య, వంశీ న

Webdunia
బుధవారం, 7 జూన్ 2017 (16:51 IST)
ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తీసిన వంగవీటి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా చుట్టూ వివాదాలు, కేసులు తిరిగాయి. శాండీ, వంశీ చాగంటి, శ్రీతేజ్‌, నైనా గంగూలి, కౌటిల్య, వంశీ నెక్కంటి నటించిన ఈ సినిమాను దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. సంగీతం రవిశంకర్‌ అందించారు. ఇంకా ఈ సినిమాలోని ఓ పాటకు సినీ గేయ రచయిత సిరాశ్రీ రాశారు. ఆ పాటకు వర్మ స్వరం అందించారు. అప్పట్లో ఈ పాటను వర్మ కాకుండా వేరెవరైనా పాడివుంటే బాగుండేదని సిరాశ్రీ అన్నారు. 
 
అయితే తాజాగా మాటలన్నందుకు క్షమాపణలు చెప్పారు. ఇంతకీ విషయం ఏమిటంటే? రాంగోపాల్ వ‌ర్మ‌కి తాను సారీతో పాటు థ్యాంక్స్ చెబుతున్నాన‌ని సినీ గేయ ర‌చ‌యిత సిరాశ్రీ అన్నారు. సైమా ఫిల్మ్ అవార్డ్స్ వంటి గొప్ప  వేడుక‌లో ఈ సారి ఉత్త‌మ గేయ ర‌చ‌యిత కేటగిరీలో రాంగోపాల్ వ‌ర్మ‌ తీసిన ‘వంగవీటి’ సినిమాలో తాను రాసిన పాటను గుర్తించి త‌న‌ను నామినీగా ఎంపిక చేశార‌న్నారు. 
 
ఈ సినిమాలో పాట రాసేందుకు రాంగోపాల్ వర్మ త‌న‌ను ఎంచుకున్నార‌ని, కానీ ఆ పాటను వర్మ కాకుండా ప్రొఫెషనల్ సింగర్ పాడితే బాగుండేది అని అప్పట్లో తాను అనుకున్నానని తెలిపారు. కానీ ఈ అవార్డుకు తన‌ను నామినీగా ఎంపిక చేసిన‌ తర్వాత వ‌ర్మ‌కి సారీ, థ్యాంక్స్ రెండూ చెప్పేస్తున్నానని సిరాశ్రీ తన ఫేస్ బుక్‌లో పేర్కొన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశ వ్యాప్తంగా స్వల్పంగా పెరిగిన రైలు చార్జీలు...

పోలవరం - బనకచర్ల ప్రాజెక్టుకు నో పర్మిషన్ : కేంద్రం

ఏపీ లిక్కర్ స్కామ్ : చెవిరెడ్డికి షాకిచ్చిన సిట్ బృందం .. ఇద్దరు పీఏలు అరెస్టు?

దేశంలో కీలక నిబంధనల్లో మార్పులు.. ఐటీఆర్, క్రెడిట్ కార్డులు, తత్కాల్‌ టిక్కెట్ల బుకింక్‌కు ఆధార్ లింక్...

మహిళకు మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడిన ఆర్ఎంపీ వైద్యుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments