Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్ గోపాల్ వర్మపై వంగవీటి రాధాకృష్ణ ఫైర్: డబ్బు కావాలని అడిగితే ముఖాన కొట్టేవాళ్లం..

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'వంగవీటి' చిత్రంపై మొదటి నుంచీ అభ్యంతరాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. తాజాగా రామ్ గోపాల్ వర్మపై వంగవీటి రాధకృష్ణ మండిపడ్డారు. డబ్బు

Webdunia
సోమవారం, 26 డిశెంబరు 2016 (09:41 IST)
వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'వంగవీటి' చిత్రంపై మొదటి నుంచీ అభ్యంతరాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. తాజాగా రామ్ గోపాల్ వర్మపై వంగవీటి రాధకృష్ణ మండిపడ్డారు. డబ్బు కోసం వంగవీటి జీవితచరిత్రను కించపర్చేలా చిత్రీకరించి గొప్పలు చెప్పుకుంటున్నారని ఆరోపించారు. డబ్బు కావాలని అడిగితే రంగా అభిమానులు చందాలు వేసుకుని ముఖాన కొట్టేవాళ్లమన్నారు. వంగవీటి రంగా విగ్రహానికి పూలమాల వేసి రాధ నివాళులర్పించారు. 
 
తన తండ్రి ఆశయ సాధన కోసం కృషిచేస్తానని వంగవీటి రాధాకృష్ణ స్పష్టం చేశారు. రంగాను హత్య చేసిన వాళ్లు దర్జాగా తిరుగుతున్నా కనిపించడం లేదా అని ప్రశ్నించారు. అన్నీ తెలుసంటూ కోతలు కోసే వర్మ తగిన మూల్యం చెల్లించుకుంటారని రాధాకృష్ణ హెచ్చరించారు.
 
ఇకపోతే.. ఇప్పటికే వంగవీటి సినిమాపై రంగా ఫ్యాన్స్ హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. కాపుల మనోభావాలను కించపరిచేలా 'వంగవీటి' సినిమాను చిత్రీకరించారని రంగా అభిమానులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. సినిమా టైటిల్‌తో పాటు కాపులను కించపరిచే సన్నివేశాలను వెంటనే తొలగించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కారు డ్రైవ్ చేస్తూ అనంతలోకాలకు చేరుకున్న ఎస్ఐ

Biryani-Chicken Fry కేరళ అంగన్‌వాడీల్లో ఉప్మా వద్దు... బిర్యానీ, చికెన్ ఫ్రై ఇస్తే బాగుండు.. బాలుడి వీడియో వైరల్ (video)

టెన్త్ క్లాస్ స్టూడెంట్స్‌కి స్నాక్స్.. సాయంత్రం 6 రకాలు.. రోజుకో రకం

బైక్ దొంగతనాలు.. ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు..టెస్ట్ రైడ్ ముసుగులో..?

ఏపీలో రూపురేఖలు మారిపోనున్న రైల్వే స్టేషన్లు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

దేశానికి సవాల్ విసురుతున్న కేన్సర్ - ముందే గుర్తిస్తే సరేసరి.. లేదంటే...

లొట్టలు వేస్తూ మైసూర్ బోండా తినేవాళ్లు తెలుసుకోవాల్సినవి

ఆకాకర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments