Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రెండింగ్‌లో అదరగొడుతున్న ఎల్లువచ్చి గోదారమ్మ సాంగ్ ప్రోమో.. (వీడియో)

Webdunia
బుధవారం, 18 సెప్టెంబరు 2019 (11:04 IST)
వరుణ్ తేజ్ హీరోగా హరీష శంకర్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం "వాల్మీకి". రామ్ ఆచంట, గోపీ ఆచంట కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబరు 20వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్‌కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుంది. తమిళంలో సూపర్ హిట్ సాధించిన "జిగర్తాండ" మూవీకి తెలుగు రీమేక్ అన్న విషయం తెలిసిందే. 
 
ఈ చిత్రంలో మిక్కీ జే మేయర్ అందించిన స్వరాలు చాలాకొత్తగా వున్నాయి. అయితే వాల్మీకి సినిమాలో అలనాటి తారలు శోభన్ బాబు, శ్రీదేవిలు నటించిన దేవత సినిమాలోని సూపర్ హిట్ పాట "ఎల్లువచ్చి గోదారమ్మ"ని రీమిక్స్ చేశారు. ఈ సాంగ్ ప్రోమోని దర్శకేంద్రుడి చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ పాట ప్రస్తుతం నెట్టింటిని షేక్ చేస్తోంది. టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. 
 
ఈ పాటను విడుదల చేసిన సందర్భంగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. దేవత సినిమాలో ఆ పాటని షూట్ చేయాలనుకున్నప్పుడు చాలా గమ్మత్తు జరిగిందన్నారు. ఈ పాటని షూట్ చేయడానికి రాజమండ్రి దగ్గర్లోని ఉండ్రాజవరం అనే ఊరికి వెళ్లాం. అక్కడ ఒక డాబా కూర్చుని ఆలోచిస్తున్నప్పుడు పక్కన టప్ టప్ అని చప్పుళ్ళు వినిపిస్తున్నాయి. అవేంటని అడిగితే ఈ ఊళ్ళో వాళ్ళు బిందెలు తయారు చేస్తారు. ఆ చప్పుడు వాటిదే అన్నారు.
 
వెంటనే బిందెల తో షూట్ చేయాలనే ఆలోచన వచ్చిందని అన్నారు. ఈ పాట ఇంత బాగా రావడనికి కారణమైన రామానాయుడు గారికి, వేటూరి సుందర రామ్మూర్తి గారి దన్యవాదాలు తెలియజేశారు. ఇక ఆ సాంగ్‌ని అదే పద్దతిలో హరీష్ శంకర్ తీయడం బాగుందని, తనకి నచ్చిందని చెప్పుకొచ్చారు. ఇకపోతే.. ఈ సినిమాకు బిజినెస్ కూడా ఓ రేంజ్‌లో జరిగినట్లుగా తెలుస్తోంది. 
 
 
సెప్టెంబర్ 20న విడుదలౌతున్న వాల్మీకిలో వరుణ్ 'గద్దలకొండ గణేష్'గా వస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్‌తో పాటు పూజా హెగ్డే, తమిళ నటుడు అధర్వ కీలక పాత్రలో నటిస్తున్నాడు. మిక్కీ జే. మేయర్‌ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. రామ్‌ ఆచంట, గోపీ ఆచంట.. 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై నిర్మిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మా సిఫార్సు లేఖలను పరిగణనలోకి తీసుకోండి.. బీఆర్ నాయుడికి హరీశ్ వినతి (Video)

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు, ఎందుకో తెలుసా?

అమెరికా నుంచి భారతీయులను ప్రత్యేక విమానాలలో ఎందుకు తిప్పి పంపుతున్నారు, ట్రంప్ వచ్చాక ఏం జరగనుంది?

నిరూపిస్తే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటాం : చెవిరెడ్డికి బాలినేని సవాల్

బంగాళాఖాతంలో మరింతగా బలపడిన వాయుగుండం.. దిశ మారుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments