Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.100 కోట్ల క్లబ్‌లో వకీల్ సాబ్... తొలివారంలో కలెక్షన్ల కుమ్ముడు

Webdunia
గురువారం, 15 ఏప్రియల్ 2021 (10:58 IST)
వకీల్ సాబ్ కలెక్షన్లు కుమ్మేస్తున్నాయి. ఏప్రిల్ 9న విడుదల ఈ చిత్రం హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. ఫస్డ్ డే నుంచి కలెక్షన్ల వరద పారిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరి.. బ్రేక్ ఈవెన్ సాధించి.. నిర్మాతల్ని లాభాల బాట పట్టించింది. వారం రోజుల పాటు మొత్తంగా వరల్డ్ వైడ్ కలెక్షన్లు 100. 75 కోట్లు సాధించినట్టు ట్రేడ్ వర్గాల అంచనా.
 
ఇక నైజాం ఏరియాలో వకీల్ సాబ్ హవా గట్టిగానే ఉంది. తొలివారంలో మొత్తంగా రూ. 30 కోట్లు మార్క్ చేరుకున్నట్టు తెలుస్తోంది. సీడెడ్‌లో రూ.15 కోట్లు.. ఉత్తరాంధ్రలో 12 కోట్లు పైనే రాబట్టిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తంగా ఉగాది, అంబేద్కర్ జయంతి సెలవు దినాలు రావడంతో వకీల్ సాబ్ కలెక్షన్స్ ఊపందుకున్నాయి.
 
తొలి షోతో వకీల్ సాబ్ వేట మొదలుపెట్టగా... వరుసగా ఐదోరోజు సక్సెస్ ఫుల్ రన్ కొనసాగింది. ఇక ఉగాది, అంబేద్కర్ జయంతి వరుస సెలవు దినాలు రావడంతో కలెక్షన్లు పుంజుకున్నాయి. పెట్టిన పెట్టుబడిన తొలి రెండు రోజుల్లోనే రాబట్టిన వకీల్ సాబ్.. బ్రేక్ ఈవెన్‌ సాధించి రూ.100 కోట్ల క్లబ్‌లో చేరినట్టు ట్రేడ్ పండితులు లెక్కలు కడుతున్నారు.
 
ఇదిలా ఉంటే.. తన సినిమాలకి సంబంధించి ఎప్పటికప్పుడు లెక్కలు బయటకు విడుదల చేసి గొప్పగా చెప్పుకునే దిల్ రాజు.. వకీల్ సాబ్ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారు.. లెక్కలు లీక్ చేస్తే ఏమౌతుంది?? ఏరోజు ఎంత వచ్చిందనే విషయం బయటకు లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం వెనుక వ్యూహం ఏమైనా ఉందా? లేదంటే ప్రభుత్వాలను నుంచి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా? అన్నది త్వరలో తేలనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

Telangana: పోలీసుల ఎదుట లొంగిపోయిన సీపీఐ మావోయిస్ట్ పార్టీ నేతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments