Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కబాలి' హిట్టా.. ఫట్టా అనేది ప్రేక్షకులే తేల్చాలి.. వివాదం వద్దు : గేయ రచయిత వైరముత్తు

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తాజా చిత్రం 'కబాలి'. ఈ చిత్రం ఈనెల 22వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాగా, మిశ్రమ స్పందన లభించింది. అయితే, కలెక్షన్లపరంగా దుమ్ము రేపుతోంది.

Webdunia
బుధవారం, 27 జులై 2016 (08:24 IST)
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తాజా చిత్రం 'కబాలి'. ఈ చిత్రం ఈనెల 22వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాగా, మిశ్రమ స్పందన లభించింది. అయితే, కలెక్షన్లపరంగా దుమ్ము రేపుతోంది. అయితే, ఈ చిత్రం పరాజయం పాలైనట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా తెలుగులో ఇప్పటికే నెగెటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అలాగే, తమిళంలో కూడా రజినీ అభిమానులు సైతం పెదవి విరుస్తున్నారు. 
 
ఈ పరిస్థితుల్లో సినీ గేయరచయిత వైరముత్తు ఇటీవలే ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ‘కబాలి’ పరాజయాన్ని మనం అంగీకరించాలి అన్నట్టు అర్థం వచ్చేలా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై రజనీ అభిమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీలో కూడా ఈ వాఖ్యలపై తీవ్ర చర్చ జరుగుతోంది. 
 
దీంతో వైరముత్తు మంగళవారం సాయంత్రం ఒక పత్రికా విడుదల చేస్తూ... ‘కబాలి’పై తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని, దయచేసి ఈ విషయాన్ని వివాదం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ‘కబాలి’ చిత్రం విజయవంతమైందా? లేదా? అన్నది అందరూ అర్థం చేసుకోవాలని తాను పేర్కొంటే, అందులో ఆ చిత్రం పరాజయమైనట్లు తాను పేర్కొనట్లు తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. తాను ఎంతగానో అభిమానించే రజినీకాంత్ చిత్రం గురించి ఈ విధంగా వ్యాఖ్యానించడంపై చింతిస్తున్నట్టు చెప్పారు. పైగా, తాను చేసిన వ్యాఖ్యలపై రజినీకి కూడా వివరణ ఇచ్చినట్టు చెప్పారు. 

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments