Webdunia - Bharat's app for daily news and videos

Install App

హింసై అరసన్‌ వివాదం ముగిసినట్టేనా? శంకర్‌-వడివేలు మధ్య డీల్ ఓకే!

Webdunia
శుక్రవారం, 18 జూన్ 2021 (12:53 IST)
Vadivelu
'హింసై అరసన్‌ 24 ఆమ్‌ పులికేసి' చిత్రానికి సంబంధించిన వివాదం పరిష్కారమైనట్టేనని తెలుస్తోంది. దర్శకుడు శంకర్‌ హింసై అరసన్‌ 23 ఆమ్‌ పులికేసి చిత్రం ద్వారా హాస్యనటుడు వడివేలును కథా నాయకుడిగా పరిచయం చేశారు. చిత్రం విజయవంతం కావడంతో అదే టీమ్‌తో హింసై అరసన్‌ 24 ఆమ్‌ పులికేసి సీక్వెల్‌ను నిర్మించాలని దర్శకుడు శంకర్‌ భావించారు.
 
షూటింగ్‌ కొంత భాగం పూర్తయిన తర్వాత కథలో మార్పులు చేశారంటూ నటుడు వడివేలు షూటింగ్‌లో పాల్గొనడానికి నిరాకరించారు. దీంతో దర్శకుడు శంకర్‌కు వడివేలుకు మధ్య తలెత్తిన విభేదాలు నిర్మాతల మండలిలో ఫిర్యాదు వరకు వెళ్లాయి. వడివేలు కారణంగా తనకు రూ.2 కోట్లు నష్టం వాటిల్లిందని శంకర్‌ ఫిర్యాదు చేశారు. ఆ తరువాత వడివేలు నటనకు దూరమయ్యారు.
 
పలుమార్లు దర్శకుడు శంకర్, వడివేలు మధ్య వివాదాన్ని పరిష్కరించడానికి నిర్మాతల మండలి ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేదు. తాజాగా వేల్స్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ సంస్థ అధినేత ఐసరి గణేష్‌ జరిపిన చర్చల వల్ల వీరి మధ్య సయోధ్య కుదిరిందని సమాచారం. దర్శకుడు శంకర్‌కు నష్టపరిహారం చెల్లించడానికి నటుడు వడివేలు సమ్మతించినట్లు, త్వరలోనే హింసై అరసన్‌ 24 ఆమ్‌ పులికేసి చిత్రం సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments