Webdunia - Bharat's app for daily news and videos

Install App

భరత్ అనే నేను: #VachaadayyoSaami పాట విడుదల.. రంగ రంగ సంబరంగా మోగెనే.. (Video)

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ''భరత్ అనే నేను'' సినిమా ఏప్రిల్ 20వ తేదీన విడుదల కానుంది. సినిమా కోసం మహేష్ బాబు అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఆత్రుతగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు

Webdunia
గురువారం, 5 ఏప్రియల్ 2018 (17:31 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ''భరత్ అనే నేను'' సినిమా ఏప్రిల్ 20వ తేదీన విడుదల కానుంది. సినిమా కోసం మహేష్ బాబు అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఆత్రుతగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలో అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపే దిశగా.. ఈ సినిమాకు చెందిన పాట లిరిక్స్‌ను గురువారం సాయంత్రం విడుదల చేశారు.

ఇప్పటికే విడుదలైన భరత్ అనే నేను సినిమాకు చెందిన రెండు పాటలు రెండు సాంగ్స్ మంచి మార్కులు కొట్టేశాయి. ఇక ముచ్చటగా మూడో పాటగా ''వచ్చాడయ్యో సామి'' అనే పాటను గురువారం విడుద చేశారు. ఈ పాటకు సంబంధించిన పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. 
 
ఈ పోస్టర్లో మహేశ్ బాబు లుంగీ పైకి కట్టేసి.. తలకి పాగా చుట్టుకుని జనంతో కలిసి చిందులేస్తూ ఈ పోస్టర్లో కనిపించాడు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇకపోతే.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో కైరా అద్వానీ కథానాయికగా నటించింది.

ఈ నెల 7వ తేదీన మహేష్ బాబు భరత్ అనే నేను సినిమా ఆడియో ఫంక్షన్ జరుగనుంది. ఈ ఫంక్షన్‌కు ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్, చరణ్ హాజరవుతారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇంకేముంది..? తాజాగా విడుదలైన ''వచ్చాడయ్యో సామి'' పాట లిరిక్స్‌ను ఈ వీడియో ద్వారా ఓ లుక్కేయండి.
 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments