నెల్లూరు జిల్లాలో ప్రభాస్ మల్టీప్లెక్స్ థియేటర్.. 'సాహో'తో ప్రారంభం

Webdunia
సోమవారం, 26 ఆగస్టు 2019 (15:42 IST)
టాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్ హీరో ప్రభాస్ సొంత థియేటర్ ప్రారంభంకానుంది. అదీ కూడా నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో ఈ మల్టీప్లెక్స్ థియేటర్ ఈ నెల 30వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. ప్రభాస్ నటించిన "సాహో" చిత్రం కూడా ఇదే రోజు విడుదలకానున్న విషయం తెల్సిందే. ఈ చిత్రంతోనే ఈ మల్టీప్లెక్స్ థియేటర్‌లోనే ప్రదర్శించనున్నారు. 
 
కాగా, వి ఎపిక్ పేరుతో నిర్మించిన ఈ మల్టీప్లెక్స్‌లోని ఓ థియేటర్‌లో ఆసియాలోనే అతిపెద్ద స్క్రీన్‌ ఉంది. సాహో చిత్రాన్ని నిర్మించిన యు.వి. క్రియేషన్స్ అధినేతల్లో ఒకరైన నెల్లూరుకి చెందిన వేమారెడ్డి వంశీ ప్రధాన భాగస్వామిగా ఈ మల్టీప్లెక్స్‌ను నిర్మించారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఇందులో భాగస్వామి అని వార్తలు వినపడుతున్నాయి. ఈ మల్టీప్లెక్స్‌ థియేటర్స్ ఆగస్టు 30వ తేదీన విడుదలవుతున్న విషయం తెల్సిందే. 
 
కాగా, ఈ మల్టీప్లెక్స్ మాల్‌లో మూడు థియేటర్లు ఉన్నాయి. ఇందులో 102.6 అడగుల వెడల్పు, 56 అడుగుల ఎత్తులో కర్వ్డ్ సిల్వర్ స్క్రీన్ ఉంది. ప్రపంచంలోని అతి పెద్ద సిల్వర్ స్క్రీన్స్‌లో ఇది మూడోది కావడం గమనార్హం. ఆసియాలో అతి పెద్ద సిల్వర్ స్క్రీన్ కూడా ఇదే. 
 
ఈ మల్టీప్లెక్స్‌లో 647 సీట్ల కెపాసిటీతో ఓ థియేటర్, 140 సీట్ల కెపాసిటీతో రెండు థియేటర్స్‌ను నిర్మించారు. దీని ప్రారంభానికి ఎవరు వస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది. కృష్ణంరాజు లేదా ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఈ మల్టీప్లెక్స్‌లను ప్రారంభించే అవకాశం ఉన్నట్టు సమాచారం.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణలోని బైంసాలో వరుస గుండెపోటులతో ఇద్దరు మృతి

పవన్ కల్యాణ్ నా చిరకాల మిత్రుడు, నేను ఆయనను ఏమీ అనలేదు, అనను: విజయసాయి రెడ్డి

ఆంధ్ర, తెలంగాణల్లో హాట్ టాపిక్ అదే.. కేటీఆర్-జగన్, రేవంత్-చంద్రబాబుల భేటీ

అమరావతిలో 25 బ్యాంకులకు ఒకే రోజు శంకుస్థాపన

ఏలూరు జిల్లాలో పవన్ పర్యటన... సమస్యలను ఏకరవు పెట్టిన స్థానికులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments