ఎంవిఎం పిక్చర్స్ బ్యానర్ పై మహేష్ విఠా నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఉత్తుత్త హీరోలు. ప్రముఖ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకొని, ఎన్నో సినిమాల్లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన మహేష్ విఠా స్వీయ దర్శకత్వంలో మొట్టమొదటిసారి పూర్తి రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఉగాది కానుకగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ మేకర్స్ విడుదల చేశారు.
తొలిసారిగా హీరోగా నటిస్తున్న మహేష్ విఠా ఈ సినిమాకు నిర్మాతగా, దర్శకుడిగా వ్యవహరించారు. కామెడీ, సస్పెన్స్ ప్రధాన అంశాలుగా ఈ చిత్రాన్ని మొత్తం రాయలసీమ బ్యాగ్రౌండ్ లోనే తెరకెక్కించారు. ఉగాది శుభాకాంక్షలతో విడుదల చేసిన తాజా పోస్టర్ ను గమనిస్తే.. నలుగురు ప్రధాన పాత్రధారులు వారి ఊర్లో ఓ భారీ మోసం చేసి పారిపోతున్నట్లు అనిపిస్తుంది. అందుకు తగ్గట్టుగానే డబ్బులు, నగలు బ్యాగు నుంచి జారీ గాల్లో ఎగురుతున్నాయి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విశేషం ఏంటంటే అందులో ఒక పాత్రధారుడి చేతిలో కోడిపుంజు ఉండడం చూస్తే ఇది కచ్చితంగా కామెడీని పంచె చిత్రమని తెలుస్తుంది.
బలమైన కథ, దానికి తగ్గట్టుగానే కామెడీ సన్నివేశాలను అద్భుతంగా రాసుకొని రాయలసీమ భాష, యాసతో సీమ ప్రాంతంలో జరిగే ఓ ఆసక్తికరమైన సంఘటన చుట్టూ ఉత్తుత్త హీరోలు చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, సీమ చరిత్రలో ఇది ఒక కల్ట్ ఫిలిమ్ గా మిగిలిపోతుందని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.