అన్ స్టాపబుల్ షో చూసి షాక్ అయ్యాను అని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా అన్నారు. ఈ ప్రోగ్రాం ఎవరు డిజైన్ చేశారో కానీ వాళ్లకు హ్యాట్సప్. ఎందుకంటే బాలయ్యబాబు గారు అంటే సీరియస్ గా వుంటారనే ఇమేజ్ వుంది. కానీ ఆ షో చూసిన తర్వాత ఆయన ఇంత సరదాగా వున్నారనిపించింది. బాలకృష్ణ గారు చెప్పిన మొఘల్-ఈ-ఆజం డైలాగులకు రణ్‌బీర్ కపూర్ మతిపోయింది. అది రణ్‌బీర్ కపూర్ ముత్తాత సినిమా. అందులో డైలాగులు రణ్‌బీర్ కి కూడా గుర్తు లేవు. బాలకృష్ణ గారు చెప్పిన డైలాగులు విని నేను ఆలోచనలో పడిపోయాను.
అసలు అంత మెమరీ ఎలా వుంటుందని షాక్ అయ్యాను. మామూలు డైలాగులు కావు అవి. బాలకృష్ణ గారి ఫ్యాన్ అయిపోయా. తెలుగులో కాదు నార్త్ లో కూడా ఇప్పుడా డైలాగులు ఎవరికీ గుర్తుఉండవు. కొత్తగా ఆడిషన్స్ కి వెళ్ళే నటులు కూడా ఆ డైలాగులు చెప్పరు. ఎందుకంటే అవి చాలా కష్టమైనవి అని వంగ అన్నారు.