Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహానటిలో కీర్తిసురేష్ ఫస్ట్‌లుక్.. ఆ కళ్లను దాచలేరంటూ... సమంత ట్వీట్

హీరోయిన్ కీర్తి సురేష్‌కు నేడు (అక్టోబర్ 17) పుట్టిన రోజు. ఈ సందర్భంగా మహానటి సినీ యూనిట్ ఆమె కళ్లను మాత్రం చూపిస్తూ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఈ ఫోటోను షేర్ చేస్తూ.. కీర్తి సురేష్‌కు సమంత పుట్టిన

Webdunia
మంగళవారం, 17 అక్టోబరు 2017 (17:05 IST)
హీరోయిన్ కీర్తి సురేష్‌కు నేడు (అక్టోబర్ 17) పుట్టిన రోజు. ఈ సందర్భంగా మహానటి సినీ యూనిట్ ఆమె కళ్లను మాత్రం చూపిస్తూ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఈ ఫోటోను షేర్ చేస్తూ.. కీర్తి సురేష్‌కు సమంత పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. ఇప్పటికే అభిమానుల నుంచి శుభాకాంక్షలు, ప్రశంసలు అందుకున్న కీర్తి సురేశ్‌పై సమంత చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ''ఆ కళ్లను ఎవ్వరూ దాచలేరు. ఆ కళ్లే మహానటి జీవిత చరిత్రను చెప్పబోతున్నాయి. కీర్తి సురేశ్ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు" అని కామెంట్ చేసింది. 
 
మహానటి ఫస్ట్ లుక్‌లో కీర్తి మహానటి సావిత్రిలానే కనిపించింది. ఆమె కళ్లేనా అవి అన్నట్లు నెటిజన్లు, ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. కేవ‌లం కీర్తి క‌ళ్లు మాత్రమే క‌నిపిస్తున్న ఈ ఫస్ట్‌లుక్ చూస్తే అది సావిత్రి ఫొటోనా? లేక కీర్తి ఫొటోనా? అని తేల్చుకోలేకపోయారు. మహానటిగా కీర్తిసురేష్ బాగా ఒదిగిపోయిందని ప్రశంసలు కురిపిస్తున్నారు. 
 
ఇకపోతే, నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో స‌మంత కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. అలాగే మ‌ల‌యాళ న‌టుడు దుల్క‌ర్ స‌ల్మాన్‌, అర్జున్ రెడ్డి జంట విజ‌య్ దేవ‌రకొండ, షాలిని పాండేలు కూడా ఈ చిత్రంలో న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించి దుల్క‌ర్ స‌ల్మాన్ పోషిస్తున్న జెమినీ గ‌ణేష‌న్ పాత్ర ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేశారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments