Webdunia - Bharat's app for daily news and videos

Install App

RKFI52 లో ఉలగనాయగన్ కమల్ హాసన్ జాయిన్

Webdunia
బుధవారం, 5 జులై 2023 (11:29 IST)
shimbu,kamal
సక్సెస్ ఫుల్ డైరెక్టర్  హెచ్.వినోద్ దర్శకత్వంలో RKFI ప్రొడక్షన్ నంబర్ 52ని ప్రజంట్ చేస్తోంది. ప్రముఖ  తారాగణం, సిబ్బందితో కూడిన ఈ చిత్రం వారి గత బ్లాక్‌బస్టర్ ‘విక్రమ్’ తర్వాత RKFI నుండి మరపురాని చిత్రాల్లో ఒకటిగా ఉంటుందని భరోసా ఇస్తుంది.  
 
దిగ్గజ నటుడు, దర్శకుడు , నిర్మాత కమల్ హాసన్ మాట్లాడుతూ  ఎంటర్ టైన్ మెంట్ పరిశ్రమలో ఎన్నో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొత్త ప్రతిభని స్వీకరించడం, ఉన్నత వినోద విలువలతో నాణ్యమైన చిత్రాలను రూపొందించడానికి సహకరించడం అత్యవసరం. నేను నా అనుభవాన్ని  పంచుకోవడానికి,  అలాగే కొత్త విషయాలను తెలుసుకోవడానికి నెక్స్ట్ జనరేషన్ ప్రతిభావంతులతో కలసి పని చేయడానికి  ఎదురుచూస్తున్నాను. వినోద్ సృజనాత్మకత, కంటెంట్ పట్ల నిబద్ధత కలిగి వున్న దర్శకుడు. కమర్షియల్‌గా సక్సెస్‌ తో పాటు సామాజిక ప్రాధాన్యత ఉన్న సినిమాలు తీశారనే పేరు తెచ్చుకున్నారు. RKFI 52 కూడా ఇలాంటి కలయికలోనే ఉంటుంది. చిత్రానికి ఈ కథ అందిస్తున్నందుకు చాలా ఎక్సయిటెడ్ గా వున్నాను’’ అన్నారు.
 
దర్శకుడు హెచ్.వినోద్ తన ఆనందాన్ని పంచుకుంటూ, "ఇది నాకు ప్రత్యేకమైన ప్రాజెక్ట్,  ఉలగనాయగన్ కమల్ హాసన్‌ తో కలిసి పనిచేయడం , KH 233 (RKFI 52) కోసం ఆయన  కథ అందించడం నాకు చాలా ఆనందంగా ఉంది. కమల్ సర్  సినిమాలు చూస్తూ ఎన్నో అంశాలు నేర్చుకోవచ్చు.  ఆయన మానవతా ఆలోచనలు, సామాజిక స్పృహ,చేపట్టిన ప్రతి పనిలో రాణించాలనే తపన నిజంగా స్ఫూర్తిదాయకమైనవి.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులని ఆకట్టుకునే ప్రత్యేకమైన , ఆకర్షణీయమైన కథకి జీవం పోయడం మా లక్ష్యం’’ అన్నారు
RKFI  ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రాలని నిర్మిస్తోంది. మణిరత్నం దర్శకత్వంలో ఉలగనాయగన్ కమల్ హాసన్ నటిస్తున్న KH 234, శివకార్తికేయన్ , సాయి పల్లవి నటిస్తున్న RKFI 51, శిలంబరసన్ ప్రధాన పాత్రలో RKFI 56 చిత్రాలు రూపొందుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెన్ను వివాదం ఓ విద్యార్థిని ప్రాణం తీసింది... ఫోర్త్ ఫ్లోర్ నుంచి దూకేసింది..

కారులో ప్రియురాలుతో సర్పంచ్, డోర్ తీసి పిచ్చకొట్టుడు కొట్టిన భార్య (video)

డొనాల్డ్ ట్రంప్‌తో భారతీయ ఐటీకి కష్టకాలం.. వీసా ఆంక్షలు సైతం పీడకల?!

"ఫ్యూచర్ సిటీ"తో రేవంత్ రెడ్డికి తలనొప్పులు.. ఆ కల కోసం.. ఆ పని చేయకపోతే..?

ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు రామ్ మూర్తి నాయుడు ఇకలేరు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

తర్వాతి కథనం
Show comments