Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉదయ్ శంకర్ చిత్రానికి నచ్చింది గర్ల్ ఫ్రెండూ టైటిల్ ఖ‌రారు

Webdunia
సోమవారం, 4 ఏప్రియల్ 2022 (15:40 IST)
Uday Shankar, Jennifer Emanuel
యువ హీరో ఉదయ్ శంకర్ నటిస్తున్న కొత్త సినిమా నచ్చింది గర్ల్ ఫ్రెండూ. ఎప్పుడూ వైవిధ్యమైన కథలు ఎంచుకునే ఉదయ్ శంకర్ తన కెరీర్ లో చేస్తున్న మరో విభిన్న చిత్రమిది. జెన్నీ హీరోయిన్‌గా నటిస్తోంది. మధునందన్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. కమర్షియల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ మూవీని దర్శకుడు గురు పవన్ తెరకెక్కిస్తున్నారు. శ్రీరామ్ ఆర్ట్స్ బ్యానర్ పై  అట్లూరి ఆర్ సౌజన్య సమర్పణలో.. అట్లూరి నారాయణ రావు నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఉగాది పండుగ సందర్భంగా టైటిల్ అనౌన్స్ మెంట్ చేశారు.
 
ఈ టైటిల్ పోస్టర్ చూస్తే...హీరోయిన్ కు రోజ్ ఫ్లవర్ ఇస్తూ లవ్ ప్రపోజ్ చేస్తున్న కథానాయకుడిని వద్దని వారిస్తున్నాడు అతని స్నేహితుడు. నచ్చింది గర్ల్ ఫ్రెండూ అనే టైటిల్ కూడా ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేశారు. ఈ పోస్టర్ తో హీరో క్యారెక్టరైజేషన్ ఏంటనే ఆసక్తి కలుగుతోంది. సీనియర్ హీరో సుమన్, పృధ్వీరాజ్ , శ్రీకాంత్ అయ్యాంగార్ ఇతర ప్రధాన పాత్రల్లో  నటిస్తున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమాలో అందమైన ప్రేమకథ చుట్టూ జరిగే థ్రిల్లింగ్ అంశాలను చాలా కమర్షియల్ వేలో చూపించబోతున్నారు.
 
నటీ నటులు: ఉదయ్ శంకర్, జన్నీఫర్ ఇమ్మానుయేల్,
 సీనియర్ హీరో సుమన్,  మధునందన్, పృధ్వీరాజ్, శ్రీకాంత్ అయ్యాంగార్, సనా, కళ్యాణ్ తదితరులు
సాంకేతక వర్గం: సినిమాటోగ్రఫీ : సిద్దం మనోహార్, మ్యూజిక్: గిఫ్టన్, ఎడిటర్: జునాయిద్ సిద్దిఖి, ఆర్ట్: దొలూరి నారాయణ, పి.ఆర్.ఓ: జియస్ కె మీడియా నిర్మాత : అట్లూరి నారాయణ రావు, దర్శకత్వం : గురు పవన్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వీడు సామాన్యుడు కాదు.. అసాధ్యుడు.. నాలుకతో ఫ్యాన్ రెక్కలను...

కేసీఆర్ ఫ్యామిలీ వెయ్యేళ్లు జైలుశిక్ష అనుభవించాలి : సీఎం రేవంత్ రెడ్డి

జనసేన పార్టీకి ఇంధనం దిల్ రాజు, నా బంగారం రామ్ చరణ్: డిప్యూటీ సీఎం పవన్

మకర సంక్రాంతికి ఏపీలో జగన్మోహన్ రెడ్డి వుండరా?

Telangana : తెలంగాణలో ఎటువంటి కేసులు లేవు - HMPVపై భయం వద్దు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

తర్వాతి కథనం
Show comments