Webdunia - Bharat's app for daily news and videos

Install App

'తులసి దళం'కి సీక్వెల్ గా యండమూరి కధ... ఆర్జీవి చిత్రం!

Webdunia
గురువారం, 25 నవంబరు 2021 (14:07 IST)
మూడు దశాబ్దాల క్రితం యావత్ తెలుగు పాఠకులను ఉర్రూతలూగించిన “తులసీ దళం" నవల ఎంత పాపుల‌ర్ అయిందో చాలా మందికి తెలుసు. అప్ప‌ట్లో స్టార్ హీరోలకు ఎంత మాత్రం తీసిపోని ఫాలోయింగ్ తో, స్టార్ రైటర్ గా నీరాజనాలందుకున్న యండ‌మూరి ఇపుడు మానసిక వికాస రచనలతో వేలాది మంది జీవితాలను ప్రభావితం చేస్తున్నారు. గ‌త రచనా సంచలనం యండమూరి తాజాగా తులసితీర్ధం సినిమాకు శ్రీకారం చుట్టారు. కాన్సెప్ట్ పరంగా ఇది 'తులసిదళం"కు సీక్వెల్.
 
 
ఇప్పటివరకు తన సొంత కథలతో మాత్రమే సినిమాలు తీస్తూ, నిత్యం వివాదాల్లో ఉండే రాంగోపాల్ వర్మ తన కెరీర్ లో మొదటిసారి వేరే రచయిత సమకూర్చిన కథతో సినిమా రూపొందించేందుకు అంగీకరించారు. ఆ చిత్రమే ఈ తులసి తీర్ధం.  భీమవరం టాకీస్ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ రేర్ కాంబినేషన్ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా గ్రాఫిక్స్ తో నిర్మించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. అతి త్వరలో సెట్స్ కు వెళ్లనున్న ఈ హారర్ థ్రిల్లర్ కు సంబంధించిన మరిన్ని వివరాలు అతి త్వరలో వెల్లడి కానున్నాయి. అయితే, మొద‌టి నుంచి హ‌ర్ర‌ర్, జ‌నాన్ని భ‌య‌పెట్టి ఆనంద‌ప‌డే ఆర్జీవీ ఈ కొత్త స్వీక్వెల్ లో ఎంత వ‌ర‌కు త‌న ఆనందాన్ని తీర్చుకుంటాడో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్యార్థినిపై లైంగిక వేధింపులు.. తిరుపతిలో ప్రొఫెసర్ అరెస్ట్

TTD: తెలంగాణ భక్తుల కోసం.. వారి సిఫార్సు లేఖలను అనుమతించాలి.. టీటీడీ

Sankranti Holidays: సంక్రాంతి సెలవులను ప్రకటించిన ఏపీ సర్కారు..

PV Sindhu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు, వెంకట సాయి.. (video)

Telangana: భర్తను చెల్లెలి సాయంతో హత్య చేసిన భార్య.. ఎందుకు ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

Herbal Tea హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

winter heart attack చలికాలంలో గుండెపోటుకి కారణాలు, అడ్డుకునే మార్గాలు

అరుదైన ఎక్స్‌ట్రాసోసియస్ ఆస్టియోసార్కోమాతో బాధపడుతున్న 18 ఏళ్ల బాలికకు ఏఓఐ విజయవంతంగా చికిత్స

Dry cough Home remedies పొడి దగ్గు తగ్గటానికి చిట్కాలు

తర్వాతి కథనం
Show comments