Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కూటర్‌ కమ్‌ ఆటో వెహికల్ ప్రేమలో పడిన టీనేజర్స్ కథతో టుక్‌ టుక్‌

దేవి
బుధవారం, 26 ఫిబ్రవరి 2025 (15:29 IST)
Took Took
హర్ష రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు,సాన్వీ మేఘన, నిహాల్ కోధాటి ముఖ్యతారలుగా ఫ్రెష్ కంటెంట్‌తో రాబోతున్న చిత్రం 'టుక్‌ టుక్‌'.  ఈ చిత్రానికి సి.సుప్రీత్‌ కృష్ణ దర్శకుడు. చిత్రవాహిని మరియు ఆర్ వై జి సినిమాస్‌ పతాకంపై రాహుల్ రెడ్డి, లోక్కు శ్రీ వరుణ్, శ్రీరాముల రెడ్డి, సుప్రీత్ సి కృష్ణలు నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది. కాగా ఈ చిత్రాన్ని మార్చి 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు మేకర్స్‌. దీనికి సంబంధించిన పోస్టర్‌ను మహా శివరాత్రి కానుకగా విడుదల చేశారు మేకర్స్‌. 
 
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ '' న్యూ ఏజ్‌ స్టోరీతో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం ఆడియన్స్‌కు కొత్త అనుభూతిని పంచుతుంది. ముఖ్యంగా ఈ చిత్రంలో ఉండే స్కూటర్‌ కమ్‌ ఆటో ఎన్నో మ్యాజికల్‌ పవర్స్‌ను కలిగి ఉంటుంది. అందరూ ఆ వెహికల్ ప్రేమలో పడిపోతారు. దానికి ఓ మంచి రహస్యం కూడా ఉంటుంది. సినిమాలో ఎంతో ఎంటర్‌టైన్‌మెంట్‌ను కూడా పంచుతుంది. యువతరం నచ్చే అంశాలతో పాటు కుటుంబ ప్రేక్షకులు మెచ్చే భావోద్వేగాలు కూడా ఈ చిత్రంలో ఉన్నాయి. తప్పకుండా ఈ చిత్రం అన్ని వర్గాల ఆదరణ పొందుతుందనే విశ్వాసం వుంది' అన్నారు.
 
నిర్మాతలు మాట్లాడుతూ '' సుప్రీత్ సి కృష్ణ దర్శకత్వం వహించిన, "టుక్ టుక్" ఒక ఆహ్లాదకరమైన సినిమాటిక్ అనుభూతిని అందిచేలా ఉంటుంది. అసలు కథలో ఆ స్కూటర్‌ కమ్‌ ఆటో పాత్ర ఏంటి అనేది సినిమాలో ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఈ కథ ఒక గ్రామం నేపథ్యంలో కొనసాగుతుంది. తప్పకుండా చిత్రం అందరికి నచ్చుతుంది. ఈ వేసవికి ప్రేక్షకులకు మంచి వినోదం అందించండానికి మార్చి 21న మా టుక్‌ టుక్‌ రెడీ అవుతోంది' అన్నారు.
సంతు ఓంకార్ సంగీతం అందించిన ఈ చిత్రానికి హార్థిక్ శ్రీకుమార్ సినిమాటోగ్రఫీ అందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనసేన సంస్థాగత బలోపేతం కోసం త్రిశూల్ వ్యూహం : పవన్ కళ్యాణ్

బీహార్‌లో ఒక్క ఓటు కూడా చోరీ కానివ్వం : రాహుల్ గాంధీ

యూపీఎస్పీ అభ్యర్థుల కోసం ప్రతిభా సేతు పోర్టల్

ఏలూరు జిల్లాలో కానిస్టేబుల్‌ అదృశ్యం.. ఫోన్‌ సిగ్నల్‌ కట్‌!

సోషల్ మీడియాలో బ్లాక్ చేసిందనే కోపంతో అమ్మాయి గొంతు కోసిన ఉన్మాది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments