Webdunia - Bharat's app for daily news and videos

Install App

తారక్ టార్చర్ భరించలేక పోయా : దర్శకుడు త్రివిక్రమ్

Webdunia
మంగళవారం, 9 అక్టోబరు 2018 (18:04 IST)
జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రం "అరవింద సమేత వీరరాఘవ". ఈ చిత్రానికి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ చిత్రం షూటింగ్ పూర్తయి ఈనెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. అయితే, ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఎదురైన అనుభవాలను దర్శకుడు త్రివిక్రమ్ వెల్లడించారు. 'అరవింద సమేత వీరరాఘవ' కోసం ఎన్టీఆర్‌తో పనిచేయడానికి చాలా ఇబ్బంది పడినట్టు చెప్పారు.
 
'ఉదయం ఏడు గంటలకు కాల్షీట్ అంటే.. సెట్‌లో ఆరున్నర గంటలకే ఉండేవారు. దాంతో మేం అరగంట ముందే సెట్‌కి రావాల్సి వచ్చేది. ప్రతిరోజూ మాకు అదొక టార్చర్‌లా ఉండేది. ఉదయం 5 గంటల నుంచి అర్థరాత్రి వరకూ అంత ఎనర్జీగా ఎలా ఉంటాడన్నది ఇప్పటికీ అర్థంకాదు. తారక్‌ ఎనర్జీని ఆపే యాంటీబయాటిక్‌ లేదనిపిస్తుంది. అదొక వైరస్‌. ఒక రోజులో చెయ్యాలనుకున్న సీన్‌ మధ్యాహ్నానికే పూర్తయ్యేది. 100 రోజులు షూటింగ్‌ అనుకుంటే 70 రోజుల్లోనే పూర్తయింది. హీరోలు క్రమశిక్షణగా ఉంటే అన్నీ సక్రమంగా జరుగుతాయి' అని త్రివిక్రమ్ చెప్పుకొచ్చారు.
 
ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'అరవింద సమేత వీరరాఘవ' చిత్ర ప్రత్యేక షోలకు ఏపీ సర్కారు అనుమతి ఇచ్చింది. ఈ నెల 11 నుంచి 18 వరకూ ఉదయం 5 గంటల నుంచి 11 గంటల మధ్యలో ప్రత్యేక షో (అదనపు ఆట)లు వేసుకునేందుకు థియేటర్‌, మల్టీప్లెక్సులకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సంక్రాంతికి సిద్ధం అవుతున్న పవన్ కల్యాణ్ ప్రభలు, ఉత్తరాంధ్రలో ఉరుకుతున్న జనం (Video)

Truck: ట్రక్కు కింద ఇద్దరు మోటర్ సైకిలిస్టులు.. చూడకుండానే లాక్కెళ్లిన డ్రైవర్ (video)

NTR: ఎందుకొచ్చిన గొడవ- అభిమాని ఆస్పత్రి బిల్ సెటిల్ చేసిన జూనియర్ ఎన్టీఆర్.. (video)

అరకు వ్యాలీలో అద్దంలాంటి రహదారులు... డిప్యూటీ సీఎంపై ప్రశంసలు

ఏపీ ఫైబర్‌ నెట్ నుంచి 410 మంది ఉద్యోగులపై వేటు.. జీవీ రెడ్డి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments