Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూజా హెగ్డేను ప్రేమించి పెళ్లి చేసుకోవాలంటున్న అల్లు అర్జున్!

Webdunia
బుధవారం, 17 జులై 2019 (21:26 IST)
సన్నజాజి తీగ వంటి నడుం కలిగిన హీరోయిన్ పూజా హెగ్డే. 'రంగస్థలం' చిత్రంలో ఈమె నటించిన ఐటమ్ సాంగ్‌కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఆ తర్వాత మహేష్ బాబుతో పాటు జూనియర్ ఎన్టీఆర్ చిత్రాల్లో నటించి మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ను కొట్టేసింది. అయితే, ఇపుడు ఈమెపై అల్లు అర్జున్ మనసుపడ్డారు. పూజా హెగ్డేను ప్రేమించి పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నాడు. అయితే, బన్నీకి పెళ్ళి అయి ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా.. మళ్లీ పెళ్లి ఏంటి అనేదే కదా మీ సందేహం. అయితే, ఈ కథనం చదవాల్సిందే. 
 
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇందులో బన్నీ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా, సుశాంత్, నివేదా పేతురాజ్‌లు కీలక పాత్ర పోషిస్తున్నారు. 
 
అయితే, ఇపుడు ఈ చిత్రానికి సంబంధించిన స్టోరీ లైన్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ స్టోరీ లైన్ ఇపుడు ట్రోల్ అవుతోంది. "బన్నీ.. పూజా హెగ్డే‌ను ప్రేమించి పెళ్లి చేసుకోవాలని భావిస్తాడు. అయితే, సుశాంత్‌కు పూజా హెగ్డే చెల్లెలు. 
 
అలానే బన్నీ చెల్లెలు నివేదా. ఈమెను సుశాంత్ ప్రేమిస్తాడట. ఈ ప్రేమ జంటల మధ్య జరిగిన కథ ఏంటి? క్లైమాక్స్‌లో ఈ జంటలకు పెళ్లి అవుతుందా? అనేది మిగిలిన కథ. అయితే, ఈ చిత్రం స్టోరీ లైన్ లీక్ అంశంపై చిత్ర యూనిట్ స్పందించింది. అవన్నీ ఒట్టి పుకార్లేనని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments