Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రిషకు పెరిగిపోతున్న ఫ్యాన్ ఫాలోయింగ్... 3 మిలియ‌న్లు!

భ‌గ‌వంతుడా... ఇంత అందం నాకెందుకు ఇచ్చావ్... అంటూ త్రిష‌ ఓ సినిమాలో హొయ‌లు పోతుంది. నిజ‌మే ఆమె అందానికి ఇప్ప‌టికీ అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ట్విట్ట‌ర్లో కూడా ఆమెను ఫాలో అయిపోతున్నారు. ఆమ‌ధ్య వ‌రుస త‌మిళ‌, తెలుగు సినిమాల‌తో ఇండ‌స్ట్రీ దుమ్ము దులిపి

Webdunia
సోమవారం, 21 నవంబరు 2016 (20:53 IST)
భ‌గ‌వంతుడా... ఇంత అందం నాకెందుకు ఇచ్చావ్... అంటూ త్రిష‌ ఓ సినిమాలో హొయ‌లు పోతుంది. నిజ‌మే ఆమె అందానికి ఇప్ప‌టికీ అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ట్విట్ట‌ర్లో కూడా ఆమెను ఫాలో అయిపోతున్నారు. ఆమ‌ధ్య వ‌రుస త‌మిళ‌, తెలుగు సినిమాల‌తో ఇండ‌స్ట్రీ దుమ్ము దులిపిన త్రిష‌కు ఈమ‌ధ్య బాగా గ్యాప్ వ‌చ్చింది. ఆమె క‌న్నా కుర్ర హీరోయిన్లు వ‌చ్చి ఒళ్ళు దాచుకోకుండా ఇండ‌స్ట్రీలో క‌ష్ట‌ప‌డుతుండ‌టంతో ఇక త్రిష‌ను ఎవ‌రు చూస్తారులే అనుకున్నారు. 
 
కానీ, తాజాగా త్రిష ధనుష్‌తో నటించిన కోడి హిట్ కావ‌డంతో మళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చేసింది. మోహిని, నాయకి వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూనే.. మళ్లీ స్టార్ హీరోల సరసన ఛాన్సులు కొట్టేస్తోంది. త్వరలో కమల్ హాసన్‌తో త్రిష జ‌త‌క‌డుతోంద‌ట‌. ఖాళీగా ఉన్న‌పుడు త్రిష త‌న ట్విట్ట‌ర్‌కు ప‌ని చెప్పింది. దీనితో ఈ నెర‌జాణ‌కు ఫాలోయింగ్ బాగానే పెరిగిపోయింది. 
 
అప్పుడప్పుడు సరదాగా ఫ్యాన్స్‌తో చాట్ చేస్తూ.. తన గురించిన అన్ని విషయాలు అభిమానులతో షేర్ చేసుకోవ‌డంతో సోష‌ల్ మీడియా జ‌నం ఎగ‌బ‌డిపోయారు. ఇంకేముంది త్రిష‌, సోష‌ల్ మీడియాలో రికార్డు స్థాయిలో ఫాలోయింగ్ సంపాదించింది. వ‌య‌సు మీద ప‌డుతున్నా... ఈ అమ్మడిని ట్విట్టర్‌లో షాలో అయ్యేవారి సంఖ్య మూడు మిలియన్లు దాటిపోయింది. అభిమానులకు థ్యాంక్స్ కూడా చెప్పిందీ బ్యూటి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments