Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుర్రపు స్వారీ నేర్చుకున్న 'చెన్నై చిన్నది' (video)

Webdunia
బుధవారం, 18 నవంబరు 2020 (09:20 IST)
తెలుగు సినీ పరిశ్రమలో చెన్నై చిన్నదిగా గుర్తింపు పొందిన హీరోయిన్ త్రిష. ఈ 37 యేళ్ళ ముద్దుగుమ్మ ఇప్పటికీ బ్యాచిలర్‌గానే ఉంటోంది. నిజానికి ఆ మధ్య ఓ వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు అంగీకరించి, నిశ్చితార్థం కూజా చేసుకుంది. కానీ, ఏమైందో ఏమోగానీ, ఆ నిశ్చితార్థం కాస్త క్యాన్సిల్ అయింది. 
 
అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్న త్రిషకు.. స్టార్ డైరెక్టర్ మణిరత్నం ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు. చోళుల పాలన నేపథ్యంలో కల్కి కృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా పొన్నియన్ సెల్వన్ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో త్రిష రాణి కుందవై అనే పాత్రలో నటిస్తోంది. 
 
ఈ పాత్ర గుర్రం మీద స్వారీ చేసే సన్నివేశాలు కూడా చిత్రంలో ఉంటాయి. దాంతో త్రిష గుర్రపు స్వారీ నేర్చుకోవాలని నిర్ణయించుకుంది. దాంతో త్రిష గుర్రపు స్వారీ నేర్చుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో చెన్నైలోని హార్స్ రైడింగ్ స్కూలులో జాయిన్ అయింది. తొలి ఐదు రోజుల్లో ముందుగా 'ఇంట్రో టు హార్స్ బ్యాక్ రైడింగ్' కోర్సును పూర్తిచేసింది. 
 
తర్వాత ఈ నెల 3 నుంచి ఫౌండేషన్ కోర్సు మొదలుపెట్టి, పది రోజుల్లో దానిని సక్సెస్ ఫుల్ గా పూర్తిచేసింది. ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్ కూడా తనకు అందిందని త్రిష ఆనందంగా చెబుతోంది. ఇప్పుడు అమ్మడు గుర్రం మీద మంచి స్పీడుతో దౌడు తీయగలదన్నమాట!
 
జీవితాంతం బ్యాచిలర్‌గానే ఉంటా..
తెలుగు చిత్ర పరిశ్రమలోని ముదురు హీరోయిన్లలో త్రిష ఒకరు. ఒకపుడు ఇటు తెలుగు, అటు తమిళంలో అగ్ర హీరోయిన్‌గా రాణించింది. ఆ తర్వాత పలువురుతో ప్రేమలోపడింది. ఓ వ్యక్తితో నిశ్చితార్థం కూడా జరిగింది. ఇది మధ్యలోనే వికటించింది. ఆ తర్వాత తమిళ కుర్ర హీరో శింబుతో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. కానీ, వీటిపై క్లారిటీ లేదు. ఇపుడు సినిమాలు లేక ఇంటికే ఈ చెన్నై చిన్నది పరిమతమైంది.
 
ఈ క్రమంలో తన పెళ్లిపై 37 యేళ్ళ త్రిష తాజాగా కామెంట్స్ చేసింది. తన మనసుకు నచ్చిన వ్యక్తి దొరికితే కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని త్రిష తెలిపింది. తనను పూర్తిగా అర్థం చేసుకునే వ్యక్తి దొరికితే తన వైవాహిక జీవితం ప్రారంభమవుతుందని చెప్పింది. తన మనసుకు నచ్చే వ్యక్తి దొరికేంత వరకు సింగిల్ గానే ఉంటానని స్పష్టం చేసింది. ఒకవేళ అలాంటి వ్యక్తి దొరకకపోతే జీవితాంతం ఒంటరిగానే మిగిలిపోతానని సంచలన వ్యాఖ్యలు చేసింది.

 

సంబంధిత వార్తలు

వామ్మో ఎండలు... అధిక ఉష్ణోగ్రత దెబ్బకు ఆగిపోయిన విమానం!!

జగన్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి : బ్రాహ్మణ వేదిక నేత ఫిర్యాదు

జగన్ అభిమాన పోలీసులకు హోం మంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్!!

జగన్ జల్సా ప్యాలెస్‌లో ఏమున్నాయి.. వాటికి ఖర్చు చేసిన ధరలు ఎంతో తెలుసా?

పనికిమాలిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి శాపమే : సీఎం చంద్రబాబు

అసిడిటీ తగ్గించుకోవడానికి అద్భుతమైన చిట్కాలు

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

తర్వాతి కథనం
Show comments