Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రిగుణ్ కెరీర్ కు టర్నింగ్‌ పాయింట్‌ కావాలి : అల్లరి నరేశ్

డీవీ
బుధవారం, 27 నవంబరు 2024 (13:09 IST)
turning point team with Allari Naresh
త్రిగుణ్‌ (అదిత్‌ అరుణ్‌)  హీరోగా, హెబ్బాపటేల్‌, ఇషాచావ్లా, వర్షిణి హీరోయిన్స్‌గా స్వాతి సినిమాస్‌ పతాకంపై సురేష్‌ దత్తి   నిర్మిస్తున్న చిత్రం 'టర్నింగ్‌ పాయింట్‌'. ఈ చిత్రానికి కుహన్‌ నాయుడు దర్శకుడు. బుధవారం ఈ చిత్రం టీజర్‌ను వెర్సైటైల్‌ కథానాయకుడు అల్లరి నరేష్‌ విడుదల చేశారు.  
 
ఈ సందర్భంగా నరేష్‌ మాట్లాడుతూ 'టర్నింగ్‌ పాయింట్‌ టీజర్‌ అందర్ని ఇంప్రెస్‌ చేసే విధంగా ఉంది. ఈ చిత్రం కథానాయకుడు త్రిగుణ్‌ మంచి కమర్షియల్‌ సక్సెస్‌ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ చిత్రంతో అతని కెరీర్‌కు కమర్షియల్‌ సక్సెస్‌తో టర్నింగ్‌ పాయింట్‌గా నిలుస్తుందను కుంటున్నాను. ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించి, చిత్ర టీమ్‌ అందరికి మంచి సక్సెస్‌ రావాలని కోరుకుంటున్నాను' అన్నారు. 
 
దర్శకుడు మాట్లాడుతూ '' క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న మా చిత్రం టీజర్‌ను నరేష్‌ ఆవిష్కరించడం సంతోషంగా వుంది.  క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో త్రిగుణ్ పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. చిత్రంలోని ప్రతి సన్నివేశం ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుంది. సినిమాలో యాక్షన్‌ ఏపిసోడ్స్‌ కూడా అలరించే విధంగా వుంటాయి. మర్డర్‌ మిస్టరీకి సంబంధించిన సస్పెన్స్‌ ఎలిమెంట్స్‌ ఆడియన్స్‌ ఎంగేజ్‌ చేస్తాయి. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి' అన్నారు. 
 
నిర్మాత మాట్లాడుతూ '' ఓ కొత్త పాయింట్‌తో కుహన్‌ నాయుడు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమాను నిర్మించాం. నేటి ప్రేక్షకులు కోరుకునే కొత్తదనంతో పాటు సస్పెన్స్‌ అంశాలు ఉంటాయి. ప్రతి సన్నివేశం ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుంది. టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. తప్పకుండా చిత్రం కూడా మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఉంది' అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రామ్‌గోపాల్ వర్మ సంగతి నన్ను అడిగితే ఎలా? అది హోం శాఖ పరిధిలో వుంది: పవన్ (video)

ఏపీలో కొత్త టెక్స్‌టైల్ పాలసీ.. రూ.10 వేల కోట్ల పెట్టుబడులు

అది యేడాది క్రితం పోస్టు.. ఈ కేసులో అంత తొందరెందుకో : ఆర్జీవీ ప్రశ్న

16 యేళ్లలోపు పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాల్సిందే...

ఢిల్లీలో పవన్ కళ్యాణ్ 'తుఫాన్' - నేడు ప్రధాని మోడీతో భేటీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments