Webdunia - Bharat's app for daily news and videos

Install App

Sathya Raj: భారీ ఎత్తున డేట్ మార్పుతో రిలీజ్ కాబోతోన్న త్రిబాణధారి బార్బరిక్

దేవీ
మంగళవారం, 19 ఆగస్టు 2025 (16:02 IST)
Sathyraj, Vashita sikham, Rajesh
డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల నిర్మించిన ‘త్రిబాణధారి బార్బరిక్’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పాన్ ఇండియన్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రను పోషించగా.. వశిష్ట ఎన్ సింహా, సత్యం రాజేష్, ఉదయభాను, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్ వంటి వారు కీలక పాత్రల్ని పోషించారు. 
 
ఇక ట్రైలర్ ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. విజువల్స్, ఆర్ ఆర్ ఇలా అన్నీ కూడా ఆకట్టుకున్నాయి. మోహన్ శ్రీవత్స మేకింగ్, ఇన్‌ఫ్యూజన్ బ్యాండ్ సంగీతం ఇప్పటికే అందరిలోనూ ఆసక్తి పెంచేసింది. నిర్మాత విజయ్ పాల్ రెడ్డి మొదటి ప్రాజెక్ట్ అయినా కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ ఎత్తున నిర్మించారు. ఇక ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల అయిన పాటలు అయితే శ్రోతల్ని ఎంతో ఆకట్టుకున్నాయి. మరీ ముఖ్యంగా ఈ చిత్రానికి కుశేందర్ రమేష్ రెడ్డి అందించిన విజువల్స్ అందరినీ ఆశ్చర్య పరిచేలా ఉన్నాయి. బార్బరిక్ కాన్సెప్ట్ ఇప్పటికే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే డిఫరెంట్ ప్రమోషన్స్ చేస్తూ సినిమాను జనాల్లోకి తీసుకెళ్తున్నారు.
 
‘త్రిబాణధారి బార్బరిక్’ మూవీ ఆగస్ట్ 22న విడుదల కావాల్సి ఉంది. కానీ సరైన రిలీజ్ డేట్, కావాల్సినన్నీ థియేటర్లు లభించడం కోసం ఆగస్ట్ 29కి వాయిదా వేశారు. ఇక ఈ ‘త్రిబాణధారి బార్బరిక్’ మూవీ ఆగస్ట్ 29న గ్రాండ్‌గా ఆడియెన్స్ ముందుకు రాబోతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉపరాష్ట్రపతి ఎన్నికలు : ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి

పవన్ కళ్యాణ్‌ అంత పని చేశారా? హైకోర్టులో పిటిషన్

ముంబై కుండపోత వర్షాలు - 250 విమాన సర్వీసులు రద్దు

Mumbai rains: రూ. 20 కోట్లు పెట్టి కొన్న ఫ్లాట్స్ వద్ద వరద నీరు (video)

పాత బస్తీలో విషాదం : గణేశ్ విగ్రహాన్ని తరలిస్తుండగా ముగ్గురి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments