Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఆరడుగుల బుల్లెట్‌' ట్రైలర్: గోపిచంద్‌కు హిట్టవుతుందా? నెట్టింట్లో నెగటివ్ టాక్.. (Video)

బి.గోపాల్‌ దర్శకత్వంలో జయా బాలాజీ రియల్‌ మీడియా పతాకంపై గోపీచంద్‌, నయనతార జంటగా తాండ్ర రమేష్‌ నిర్మిస్తున్న చిత్రం 'ఆరడుగుల బుల్లెట్‌'. ఈ చిత్ర ట్రైలర్‌ను చిత్ర యూనిట్‌ శుక్రవారం విడుదల చేసింది. ఈ ట్ర

Webdunia
శనివారం, 6 మే 2017 (11:42 IST)
బి.గోపాల్‌ దర్శకత్వంలో జయా బాలాజీ రియల్‌ మీడియా పతాకంపై గోపీచంద్‌, నయనతార జంటగా తాండ్ర రమేష్‌ నిర్మిస్తున్న చిత్రం 'ఆరడుగుల బుల్లెట్‌'. ఈ చిత్ర ట్రైలర్‌ను చిత్ర యూనిట్‌ శుక్రవారం విడుదల చేసింది. ఈ ట్రైలర్‌లో గోపీచంద్‌ చెప్పే పలు శక్తివంతమైన డైలాగులు ఆద్యంతం ఆసక్తికరంగా ఉన్నాయి. ఈనెల 19న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. 
 
అయితే ఈ సినిమా ట్రైలర్‌పై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మాణం అవుతున్న రోజులలో కొన్ని దశాబ్దాల కాలంనాటి మూస సినిమాను పోలినవిధంగా హీరో గోపీచంద్ నటించిన "ఆరడుగుల బుల్లెట్" ట్రైలర్‌ను చూసిన చాలామంది షాక్ అయినట్లు నెట్టింట్లో సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి. 
 
శుక్రవారం విడుదలైన ఆరడుగుల బుల్లెట్ ట్రైలర్‌ను చూసిన వారు మాత్రం రవితేజ నటించిన ''కృష్ణ'', ''కిక్'', ''బలుపు'' వంటి యాక్షన్ ఎంటర్టైన్మెంట్‌తో కూడిన సినిమాలను కలిపి తీసిన సినిమాలా ఉందని చెప్పేస్తున్నారు. ట్రైలర్లో మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగోలేదని టాక్ వస్తోంది.
 
కాగా ప్రకాష్‌ రాజ్‌, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, అభిమన్యు సింగ్‌, చలపతిరావు, సలీంబేగ్‌, ఉత్తేజ్‌, జయప్రకాష్‌రెడ్డి, ఫిరోజ్‌ అబ్బాసి, రమాప్రభ, సురేఖావాణి, సన, సంధ్యా జనక్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, సినిమాటోగ్రఫీ: బాల మురుగన్‌, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments