రూ.కోట్లు సంపాదిస్తున్న బాలీవుడ్ హీరోయిన్లు.. ఎలా?

Webdunia
బుధవారం, 13 డిశెంబరు 2023 (09:50 IST)
బాలీవుడ్ హీరోయిన్లు కోట్లు సంపాదిస్తున్నారు. ఒక చిత్రంలో నటించేందుకు బాలీవుడ్ హీరోయిన్లు కోట్లాది రూపాయల మేరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇలాంటి వారిలో ఐశ్వర్యా రాయ్ బచ్చన్ ఏకంగా రూ.10 కోట్ల మేరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇదికాకుండా వాణిజ్య ప్రకటనల రూపంలో మరో రూ.7 నుంచి రూ.8 కోట్ల మేరకు ఆమె అర్జిస్తున్నారు. ఈ కారణంగా ఆమె నికర ఆస్తి విలువ రూ.800 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. చాలాకాలంగా సినిమాలు తగ్గించినప్పటికీ అందరికంటే ఎక్కువ ఆస్తులతో అగ్రస్థానంలో ఉండటం విశేషం.
 
ఆ తర్వాత స్థానంలో ప్రియాంకా చోప్రా ఉన్నారు. బాలీవుడ్‌ను పక్కనబెట్టి హాలీవుడ్‌కు వెళ్లిన ఈ భామ... సినిమాలు, వాణిజ్య ప్రకటనల రూపంలో రూ.కోట్లు అర్జిస్తున్నారు. అంతేకాకుండా ఈమె పేరుతో సొంతంగా ఓ బ్యూటీ ప్రొడక్ట్స్ ఉత్పత్తుల కంపెనీ (అనొమలీ), దుస్తుల కంపెనీ(పర్ఫెక్ట్ మూమెంట్), న్యూయార్క్ రెస్టారెంట్ (సోనా) నడుపుతున్నారు. అలాగే పర్పుల్ పిక్చర్స్ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించారు. ఇవికాకుండా చాలా స్టార్టప్ కంపెనీల్లో ప్రియాంక చోప్రా పెట్టుబడులు పెట్టారు. అలా ప్రియాంక చోప్రా ఆస్తుల విలువ దాదాపు రూ.600 కోట్ల వరకు ఉంటుందని బాలీవుడ్ వర్గాల సమాచారం.
 
మూడో స్థానంలో ఆలియా భట్ ఉన్నారు. ఈమె ఒక్కో సినిమాకు రూ.9 నుంచి 10 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఆలియా భట్ తాజాగా "ఎడ్ ఎ మమ్మా" అనే క్లాతింగ్ బ్రాండ్‌ను కూడా ఓపెన్ చేసింది. ఈ సంస్థ టర్నోవర్ రూ.150 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఎటర్నల్ సన్‌షైన్ పేరుతో నిర్మాణ సంస్థను కూడా రన్ చేస్తున్నది. అలాగే డ్యూరోఫ్లెక్స్, ఎవర్, క్యాడ్ బరీ, క్వాలిటీవాల్స్, కార్నెటో, ఫ్రూటీ వంటి బ్రాండ్లకు సంబంధించిన వాణిజ్య ప్రకటన రూపంలోనూ బాగానే సంపాదిస్తున్నది. ఇలా దాదాపు రూ.550 కోట్ల వరకు కూడబెట్టింది. అలాగే, దీపికా పదుకొణె, కరీనా కపూర్ ఖాన్, కత్రినా కైఫ్, అనుష్క శర్మ, మాధూరి దీక్షిత్, కాజోల్, రాణి ముఖర్జీ, కంగనా రనౌత్ ఇలా అనేక మంది హీరోయిన్లు కూడా భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటూ తమ సత్తాను చాటుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొండా సురేఖ ఇంట్లో అర్థరాత్రి హైడ్రామా.. మా అమ్మ ఇంటికొచ్చి కన్నీళ్లు పెట్టుకునేది? (video)

ఏపీ అభివృద్ధికి డబుల్ ఇంజిన్ సర్కారు : ప్రధాని నరేంద్ర మోడీ

కర్ణాటక మంత్రులు వర్సెస్ నారా లోకేష్‌ల స్పైసీ వార్... రాయితీలిస్తే ఏపీకి పెట్టుబడులు రావా?

ప్రధాని మోడీ కర్మయోగి - కూటమి ప్రభుత్వం 15 యేళ్లు కొనసాగాలి : పవన్ కళ్యాణ్

PM tour in AP: ప్రధాని ఏపీ పర్యటనలో అపశృతి.. కరెంట్ షాకుతో ఒకరు మృతి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

తర్వాతి కథనం
Show comments