Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బాహుబలి' ఓ మిరాకిల్.. కుర్ర హీరోలు : అనాథ పిల్లలకు సినిమా చూపించిన సమంత

దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కించిన చిత్రం 'బాహుబలి'. ఈ చిత్రం రెండో భాగం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది. ఈ చిత్రంపై టాలీవుడ్ నటులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. బాహుబలిని తెరకెక్కించిన

Webdunia
శుక్రవారం, 28 ఏప్రియల్ 2017 (14:13 IST)
దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కించిన చిత్రం 'బాహుబలి'. ఈ చిత్రం రెండో భాగం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది. ఈ చిత్రంపై టాలీవుడ్ నటులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. బాహుబలిని తెరకెక్కించిన తీరుపై తమ ట్విట్టర్ ఖాతాల ద్వారా అభినందనలు తెలుపుతున్నారు. యంగ్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, నాని, అక్కినేని అఖిల్‌, సాయిధ‌ర‌మ్‌తేజలు ఈ సినిమాపై స్పందించారు. రాజ‌మౌళి సహా బాహుబలి చిత్ర బృందం ఇండియ‌న్ సినిమాను బాహుబ‌లికి ముందు, బాహుబ‌లి త‌ర్వాత అంటూ మాట్లాడే స్థాయికి తీసుకెళ్లార‌ని, ఇదొక మిరాకిల్ అని కొనియాడారు. 
 
ఇదిలావుండగా, టాలీవుడ్ బ్యూటీ స‌మంత శుక్రవారం తన పుట్టిన రోజును జరుకుంటుంది. ఈ సంద‌ర్భంగా ప‌లువురు అనాథ పిల్ల‌లకు హైద‌రాబాద్‌లోని ఓ థియేట‌ర్‌లో బాహుబ‌లి-2 సినిమా చూపించింది. ఆమె పుట్టిన రోజు, బాహుబ‌లి రీలీజ్ డేట్ ఒక‌టే కావ‌డం విశేషం. 
 
ఈ సంద‌ర్భంగా స‌మంతా మీడియాతో మాట్లాడుతూ... ప్ర‌త్యూష ఆర్గ‌నైజేష‌న్ పిల్ల‌లు త‌న‌తో క‌లిసి సినిమా చూడ‌డం త‌న‌కే ఆనందంగా ఉంద‌ని చెప్పింది. పిల్ల‌లందరికీ బాహుబలి చూడాలని పెద్ద కోరికగా ఉంటుంద‌ని, ఎంతో ఆత్రుత‌గా ఉంటార‌ని తెలిపింది.
 
వారి ముఖంలో సంతోషం చూస్తే త‌న‌కు ఆనందంగా ఉంటుందని అంది. చిన్న సాయం చేసినా పిల్ల‌లు వారి లైఫ్ లాంగ్ మ‌ర్చిపోరని చెప్పింది. బాహుబ‌లి సినిమా చాలా బాగుందని, రాజ‌మౌళి ఎంతో గొప్ప ద‌ర్శ‌కుడ‌ని ఆమె ప్ర‌శంసించింది. ఈ సినిమా గురించి, రాజ‌మౌళి గురించి ఒక్క పాయింట్‌లో చెప్ప‌లేమ‌ని ఆమె వ్యాఖ్యానించింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

టాయిలెట్‌ పిట్‌లో ఇరుక్కుపోయిన నవజాత శిశువు మృతదేహం.. ఎక్కడ?

ప్రజలు చిత్తుగా ఓడించినా జగన్‌కు ఇంకా బుద్ధిరాలేదు : మంత్రి సత్యకుమార్

కానిస్టేబుల్ కర్కశం... కన్నతల్లిని కొట్టి చంపేశాడు..

ప్రధాని మోడీ భద్రతా వలయంలో లేడీ కమాండో...!!

బాలానగర్ సీతాఫలంకు భౌగోళిక గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments