Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్దార్‌తో మనస్తాపం.. డాలీ, త్రివిక్రమ్, దాసరి సినిమాల తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ!!

సర్దార్ గబ్బర్ సింగ్ మిగిల్చిన చేదు అనుభవంతో ఉన్న సినిమాలు గ్యాప్ లేకుండా పూర్తి చేసి.. ఇక పూర్తిస్థాయిలో రాజకీయాల వైపు దృష్టి పెట్టాలని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ భావిస్తున్నాడు.

Webdunia
మంగళవారం, 28 జూన్ 2016 (14:50 IST)
సర్దార్ గబ్బర్ సింగ్ మిగిల్చిన చేదు అనుభవంతో ఉన్న సినిమాలు గ్యాప్ లేకుండా పూర్తి చేసి.. ఇక పూర్తిస్థాయిలో రాజకీయాల వైపు దృష్టి పెట్టాలని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ భావిస్తున్నాడు. జనసేన అధినేత, సినీ నటుడు అయిన పవన్ కల్యాణ్.. ఇప్పటిదాకా కుదుర్చుకున్న సినిమాలను ఫాస్ట్ ఫాస్ట్‌గా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది.

సర్దార్ గబ్బర్ సింగ్ విడుదలై 3 నెలలు కావొస్తున్న తరుణంలో ఎస్‌జే సూర్య సినిమాలో నటించేందుకు పవన్ ఓకే చెప్పేశారు. అయితే నటనతో సూర్య బిజీ కావడంతో డాలీని దర్శకుడిగా మార్చేశారు. డాలీకి కూడా ఓ షరతు పెట్టాడట. ఈ సినిమాను నాలుగు నెలల్లోనే పూర్తిచేయాలని చెప్పేశాడట. 
 
జూలైలో సినిమాను మొదలు పెట్టి.. నవంబర్ లోపు కానిచ్చేయాలని పవన్ డాలీకి చెప్పేశాడట. నవంబరులో డాలీతో సినిమా పూర్తయ్యాక.. త్రివిక్రమ్ సినిమాలో పవన్ కల్యాణ్ నటించనున్నాడని.. ఇది ముగిశాక.. దర్శకరత్న దాసరి నారాయణకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే దిశగా మరో చిత్రంలో నటించనున్నట్లు తెలిసింది.

అంతేగాకుండా ఎన్నికల్లోపు మాటిచ్చి కమిట్ అయిన ప్రాజెక్టులను పూర్తి చేసుకోవాలని భావిస్తున్నాడు. ఇదంతా పూర్తయ్యాక సినిమాలకు పవన్ స్వస్తి చెప్పి.. పూర్తిస్థాయిలో క్రియాశీలక రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని పవన్ భావిసున్నట్లు సమాచారం.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments