Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీనియర్ నటులు ఈశ్వరరావు కన్ను మూశారు..

Webdunia
శుక్రవారం, 3 నవంబరు 2023 (15:31 IST)
సీనియర్ నటుడు ఈశ్వరీ రావు కన్నుమూశారు. అమెరికాలోని మిచిగాన్‌లో గత నెల 31వ తేదీన తుదిశ్వాస విడిచారు. అయితే, ఈ విషయం ఆలస్యంగా వచ్చింది. ఈశ్వర్ రావు కుమార్తె అమెరికాలోని మిచిగాన్‌లో ఉంటున్నారు. కూతురు వద్దకు వెళ్లిన ఈశ్వర్ రావు అక్కడే కన్నుమూశారు. ఆయన మరణావార్తతో తెలుగు సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. సోషల్ మీడియాలో వేదికగా సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు. 
 
ఆయన దాసరి నారాయణరావు "స్వర్గం నరకం" చిత్రం  ద్వారా ఈశ్వరరావు, మోహన్ బాబు చిత్ర సీమకు పరిచయం అయ్యారు. తొలి సినిమా "స్వర్గం నరకం"తో హిట్ పాటు, కాంస్య నంది అవార్డును అందుకున్నారు. కొద్ది రోజుల క్రితం మిచిగాన్‌లోని కుమార్తె ఇంటికి వెళ్లిన ఈశ్వర రావు అక్కడే తుదిశ్వాస విడిచారు. 
 
దాదాపు 200కు పైగా సినిమాలలో, పలు సీరియల్స్‌‌లో కూడా ఈశ్వరరావు నటించారు. ప్రేమాభిషేకం, యుగపురుషుడు, దయామయుడు, ఘరనా మొగుడు, ప్రెసిడెంట్ గారి అబ్బాయి, జయం మనదే, శభాష్ గోపి తదితర విజయవంతమైన సినిమాల్లో ఈశ్వరరావు నటించారు. 
 
తన తొలి సినిమాతోనే ఆయన నంది (కాంస్య) అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. తన కెరీర్‌లో దాదాపు 200కు పైగా చిత్రాల్లో నటించారు. పలు టీవీ సీరియళ్ళలో కూడా నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చంద్రబాబు - రేవంత్ రెడ్డిలు గురుశిష్యులు కాదు : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

రిటైర్డ్ టీచర్ ఇంట్లోకి చొరబడ్డ దొంగ.. క్షమించండి.. తిరిగి ఇచ్చేస్తాను..?

బస్సు టర్నింగ్ ఇచ్చుకుంది.. మహిళ రోడ్డుపై ఎలా పడిందంటే? (Video)

అగ్నివీర్ అజయ్ కుమార్‌కి రూ.98లక్షలు ఎక్స్‌గ్రేషియా అందిందా లేదా?

బాలుడి కోసం కాన్వాయ్ ఆపిన పవన్ కల్యాణ్.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments