Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలోనే రేణూ దేశాయ్ రెండో పెళ్లి...?!! నా చెయ్యి పట్టుకో అంటూ ఫోటో

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ తాజాగా ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ అసలు విషయం ఏంటయా అంటే... ఆ ఫోటోలో ఆమె చేయిని పట్టుకున్న మరో పురుషుడి చేయి కనబడుతోంది. ఆ చేయి ఎవరదన్నది సస్పెన్స్ కాగా ఆ ఫోటో పోస్ట్ చే

Webdunia
శనివారం, 16 జూన్ 2018 (22:28 IST)
పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ తాజాగా ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ అసలు విషయం ఏంటయా అంటే... ఆ ఫోటోలో ఆమె చేయిని పట్టుకున్న మరో పురుషుడి చేయి కనబడుతోంది. ఆ చేయి ఎవరదన్నది సస్పెన్స్ కాగా ఆ ఫోటో పోస్ట్ చేసి దానితో పాటు ఓ వ్యాఖ్య కూడా చేశారు రేణూ దేశాయ్. 
 
అదేమిటంటే... "నీలో నాకు కావల్సినంత ప్రేమ దొరికింది. నీతో ఉంటే ఆ సంతోషాన్ని చెప్పలేను. నేను చాలా శాంతంగా ఉంటాను. నా చెయ్యి ఇలాగే పట్టుకో... ఎప్పటికీ విడువకు. అవును.. ఆ నమ్మకాన్ని నువ్వు నాకు కల్పించావు'' అంటూ రాశారు. ఈ కవిత, ఆ ఫోటో చూస్తుంటే ఆమెకు సరైన భాగస్వామి దొరికినట్లే అనిపిస్తోంది.
 
గతంలో జీవిత భాగస్వామి కోసం వెతుకుతున్నట్లు రేణూ దేశాయ్ బహిరంగంగానే చెప్పారు. ఎన్నాళ్లిలా ఒంటరిగా వుండాలి. నాకూ ఓ తోడు కావాలి అని ఆమె వ్యాఖ్యానించారు. తనను తన పిల్లల్ని చూసుకునేందుకు ఓ వ్యక్తి అవసరమని ఆమె వెల్లడించారు. రెండో పెళ్లి చేసుకోవాలన్న తన నిర్ణయాన్ని వెల్లడించగానే అప్పట్లో నెటిజన్లు పెద్దఎత్తున విమర్శలు చేశారు. ఐతే ఆ వ్యాఖ్యలను రేణూ దేశాయ్ కొట్టిపారేశారు. కాగా ఇప్పటి పోస్టుపై మాత్రం ఆమెకు నెగిటివ్ పోస్టులు, వ్యాఖ్యలు వస్తున్నట్లుగా కనబడలేదు. కాబట్టి త్వరలోనే రేణూ దేశాయ్ రెండో పెళ్లి చేసుకోవడం ఖాయం అని అనుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్ నగరంలో జన్మించిన రెండు తలల శిశువు

బెట్టింగ్ యాప్‌లో లూడో ఆడాడు.. రూ.5లక్షలు పోగొట్టుకున్నాడు.. చివరికి ఆత్మహత్య

కొత్త ఉపరాష్ట్రపతి రేసులో శశిథరూర్? కసరత్తు ప్రారంభించిన ఈసీ

క్యూలో రమ్మన్నందుకు.. మహిళా రిసెప్షనిస్ట్‌ను కాలితో తన్ని... జుట్టుపట్టి లాగి కొట్టాడు...

Ganesh idol immersion: సెప్టెంబర్ 6న గణేష్ విగ్రహ నిమజ్జనం.. హుస్సేన్ సాగర్‌లో అంతా సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments