Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రిస్మస్ బరిలో నిలుస్తున్న చిత్రాలేవో తెలుసా?

Webdunia
శుక్రవారం, 30 ఆగస్టు 2019 (18:41 IST)
ప్రస్తుతం టాలీవుడ్‌లో భారీ బడ్జెట్ చిత్రాలు విడుదలవుతున్నాయి. ఈరోజు ప్రభాస్ నటించిన 'సాహో' చిత్రం విడుదలైంది. మరోవైపు అక్టోబర్ 2న మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా' చిత్రం దసరాకు విడుదల కానుంది. ఈ రెండు చిత్రాల బడ్జెట్ ఒక్కొక్కటి 250 కోట్లకు పైమాటే. అందుకే ఈ చిత్రాలు సోలోగా విడుదలవుతున్నాయి. వీటికి పోటీగా వచ్చేందుకు ఏ దర్శకనిర్మాతలు ధైర్యం చేయలేదు. 
 
వీటి వల్ల తీవ్రమైన పోటీ ఉంటుందనే కొంతమంది హీరోలు సినిమాల విడుదలను వాయిదా వేసుకున్నారు. సాహో చిత్రానికి, సైరా చిత్రానికి మధ్య గ్యాప్‌లో నేచురల్ స్టార్ నాని నటించిన 'గ్యాంగ్‌లీడర్' సెప్టెంబర్ 13న విడుదలకు సిద్ధమవుతుండగా, వరుణ్ తేజ నటించిన 'వాల్మీకి' చిత్రం కూడా అదే రోజు థియేటర్లలోకి రానుంది. ఆ తర్వాత దీపావళికి ఏ చిత్రమూ విడుదల కావడం లేదు. 2020 సంక్రాంతికి మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరూ', బన్నీ 'అల వైకుంఠపురంలో' విడుదల కానున్న నేపథ్యంలో చాలా చిత్రాలు క్రిస్మస్‌కి వచ్చి సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. 
 
ర‌వితేజ న‌టిస్తున్న 'డిస్కోరాజా' చిత్రం డిసెంబ‌ర్ 20న విడుద‌ల కానుంద‌ని ఇది వరకే ప్ర‌క‌టించారు. నితిన్, రష్మిక జంటగా వెంకీ కుడుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'భీష్మ' సినిమా క్రిస్మ‌స్ కానుక‌గా విడుదల చేయనున్నట్లు ఇటీవ‌ల చిత్రబృందం ప్రకటించింది. 
 
క్రిస్మ‌స్ పండుగ‌కి మ‌రి కొన్ని చిత్రాలు కూడా సంద‌డి చేసేందుకు సిద్ధమ‌య్యాయి. శ‌ర్వానంద్‌, స‌మంత ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తమిళ చిత్రం '96' రీమేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని క్రిస్మ‌స్‌కి విడుద‌ల చేయాల‌ని నిర్మాత దిల్‌రాజు ప్లాన్ చేస్తున్నాడట‌. 
 
ఇక దర్శకుడు మారుతి, సాయిధ‌రమ్ తేజ కలయికలో రూపొందుతున్న 'ప్రతీరోజూ పండగే' చిత్రం కూడా క్రిస్మ‌స్‌కే ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌ని స‌మాచారం. వెంకీ, చైతూ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందుతున్న వెంకీ మామ అనే మల్టీ స్టార‌ర్ చిత్రం కూడా క్రిస్మ‌స్ స‌మ‌యంలోనే రిలీజ్ కానుందని టాక్. ఈ లిస్ట్ చూస్తుంటే ఈ ఏడాది క్రిస్మ‌స్‌కి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ పోటీ ఉండేలా క‌నిపిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments