Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎవడి చూపు పడితే పిందె పండవుతాదో ఆడే నా సుడిగాలి బ్రూస్‌ లీ.. ఐతే ఏంటి?

Webdunia
శనివారం, 10 అక్టోబరు 2015 (19:09 IST)
హాలీవుడ్‌ స్టార్‌ బ్రూస్‌లీ పేరు పెట్టి తెరకెక్కించిన రామ్ చరణ్ చిత్రం బ్రూస్ లీ చిత్రానికి న్యాయం జరుగుతుందా! లేదా! అనే చర్చ ఇండస్ట్రీలో జరుగుతోంది. బ్రూస్‌ లీ పేరు పెట్టడానికి కారణం.. తమ్ముడు, అక్క సెంటిమెంట్‌ అని చిరంజీవి ఇటీవలే ఆడియో వేడుకలో వెల్లడించారు. బ్రూస్‌ లీ నటించిన ఓ సినిమాలో కూడా ఇదే సెంటిమెంట్‌ వుంటుందని అన్నాడు. 
 
అయితే ఆ సినిమానే కాపీ చేసి తెలుగు నేటివిటీకి దిద్దినట్లు తెలుస్తోంది. మార్షల్‌ ఆర్ట్స్‌ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఒక మహానుభావుడి పేరు అది. ఆ పేరుని గౌరవించాల్సిన బాధ్యత అందరికీ వుంది. కానీ రామ్‌ చరణ్‌ నటించిన బ్రూస్‌ లీలో...పాటలు కొన్ని సన్నివేశాలు పేరుకు తగినట్లుగా లేవని విమర్శలు వస్తున్నాయి.
 
రైమింగ్‌ కోసం స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ లీ అక్షరాన్ని ఎక్కువ వాడుతూ రాసిన ఈ పాట ఇలా సాగుతుంది.. లే.. లే.. బ్రూస్‌లీ నీ చూపుల్లో తగిలింది గూగ్‌లీ.. నువ్‌ చెయ్యేస్తే నేనే నీ ఫ్యామిలీ.. ఎవడి చూపు పడితే పిందె పండవుతాదో ఆడే నా సుడిగాలి బ్రూస్‌లీ. ఇలా బ్రూస్‌లీ పేరుని ఈ పాటలో విచ్చలవిడిగా వాడేశారు. దీనిపై ఇండస్ట్రీలో పెద్దలు... పైకి విమర్శిస్తూ... సినిమా చూశాక కానీ ఏ విషయం చెప్పలేమని అంటున్నారు. చూద్దాం.. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రం గురించి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments