Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాతో మర్యాద రామన్న నటుడు.. కోసూరి వేణుగోపాల్ మృతి

Webdunia
గురువారం, 24 సెప్టెంబరు 2020 (10:29 IST)
venu gopal
ప్రముఖ సినీ నటుడు, టాలీవుడ్ కమెడియన్ కోసూరి వేణు గోపాల్‌ కరోనా కాటుకు ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారిన పడి చికిత్స పొందుతూ బుధవారం మరణించారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గత 22 రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించిడంతో మృతి చెందారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన వేణుగోపాల్‌ ఎఫ్‌‌సీఐలో మేనేజర్‌‌గా పనిచేసి రిటైర్ అయ్యారు.
 
ఉద్యోగం చేస్తూనే సినిమాల మీద మక్కువతో ఆయన సినిమాల్లో నటించేవారు. మర్యాద రామన్న, విక్రమార్కుడు, ఛలో, పిల్ల జమిందారు వంటి సినిమాల్లో మంచి గుర్తింపు వచ్చింది. గత 26 ఏళ్ళగా సినిమాల్లో నటిస్తోన్న ఆయన ఎన్నో వందల సినిమాల్లో మంచి మంచి పాత్రలు చేశారు.
 
వేణుగోపాల్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భానుచందర్ హీరోగా 1994లో వచ్చిన తెగింపు సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన ఆయన రాజమౌళి అన్ని సినిమాల్లో ఉన్నారు. మర్యాద రామన్న సినిమా ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

11 గంటలు ఆలస్యంగా భోపాల్ - నిజాముద్దీన్ వందే భారత్ రైలు

యూజీ నీట్ ప్రవేశ పరీక్షా విధానంలో కీలక మార్పు?

మహా పీఠముడి... మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?

డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట.. ఏంటది..?

అరెస్టుకు సిద్ధంగా పోలీసులు.. పారిపోయిన రాంగోపాల్ వర్మ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments