Webdunia - Bharat's app for daily news and videos

Install App

సహజీవనం చేశాడు.. పెళ్లికి నో అన్నాడు.. 'పక్కా ప్లాన్‌' హీరో అరెస్టు

హైదరాబాద్ నగర పోలీసులు టాలీవుడ్ హీరోను అరెస్టు చేశారు. "పక్కాప్లాన్" చిత్రంతో వెండితెరపైకి అరంగేట్రం చేసిన ఈ హీరో నిజజీవితంలోనూ పక్కా ప్లాన్‌తో ఓ హీరోయిన్‌ను మోసం చేశాడు. పెళ్లి పేరుతో సహజీవనం చేసి..

Webdunia
శుక్రవారం, 17 ఫిబ్రవరి 2017 (08:42 IST)
హైదరాబాద్ నగర పోలీసులు టాలీవుడ్ హీరోను అరెస్టు చేశారు. "పక్కాప్లాన్" చిత్రంతో వెండితెరపైకి అరంగేట్రం చేసిన ఈ హీరో నిజజీవితంలోనూ పక్కా ప్లాన్‌తో ఓ హీరోయిన్‌ను మోసం చేశాడు. పెళ్లి పేరుతో సహజీవనం చేసి.. ఆ తర్వాత పెళ్లికి నిరాకరించాడు. దీంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లా గురుమిట్కల్‌ మండలం మాడేపల్లి గ్రామానికి చెందిన నగేష్‌యాదవ్ ‌(28)కు సినిమాలలో నటించడం ఇష్టం. తన కృషి ఫలితంగా శ్రీకృష్ణనగర్‌కు చెందిన అల్లబోయిన ఫణీశ్వర్‌(32) నిర్మించిన ‘పక్కా ప్లాన్‌’ అనే చిత్రంలో సెకండ్ హీరోగా నగేష్‌ యాదవ్‌, రెండో హీరోయిన్‌గా మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన నాగరాణి(29) నటించారు. గతేడాది సెప్టెంబరులో చిత్రం విడుదలైంది. 
 
ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులు మాదాపూర్‌లో కలిసి సహజీవనం చేస్తూ వచ్చారు. అయితే, అప్పటికే వివాహమై తొలి భర్తతో విడాకులు తీసుకున్న నాగరాణికి ఆరేళ్ల పాప ఉంది. అయినా ఆమెను పెళ్లి చేసుకుంటానని నగేష్‌యాదవ్‌ నమ్మించాడు. చివరికి పెళ్లికి నిరాకరించడంతో నాగరాణి అతన్ని నిలదీసింది. ఎంతకూ వినకపోవడంతో జూబ్లీహిల్స్‌ పోలీసులను ఆశ్రయించింది. గురువారం నగేష్‌యాదవ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Sajjanar: ఇలాంటి ప్రమాదకరమైన ప్రయాణాలు అవసరమా?: సజ్జనార్ ప్రశ్న

Shyamala: కృష్ణమోహన్ రెడ్డి అరెస్టుపై యాంకర్ శ్యామల ఫైర్

Taj Hotel: తాజ్ హోటల్, ముంబై ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపులు

సింగపూర్‌లో స్విమ్మింగ్-12 ఏళ్ల బాలికను వేధించాడు.. చిప్పకూడు తింటున్నాడు..

బావ పొందు కోసం భర్తను రూ.50,000 సుపారి ఇచ్చి హత్య చేయించిన భార్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments