Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారిని దర్శించుకున్న రేణు దేశాయ్, అకీరా, ఆద్య (video)

Webdunia
గురువారం, 18 మార్చి 2021 (18:18 IST)
Renu desai
ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ గురువారం తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు. రేణుతో పాటు త‌న కుమారుడు అకీరా నంద‌న్‌, కుమార్తె ఆద్య‌తో క‌లిసి తిరుమ‌ల‌లో సంద‌డి చేశారు. వీరితో ఫోటోలు దిగ‌డానికి ఫ్యాన్స్ ఎగ‌బడ్డారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ఇదిలా ఉంచితే.. ప‌వ‌న్ ప్ర‌స్తుతం అటు సినిమాల్లో.. ఇటు రాజ‌కీయాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. 
 
ఇక రేణు దేశాయి ప‌లు టీవీ కార్య‌క్ర‌మాల్లో సంద‌డి చేస్తూ బిజీగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు రేణు అకీరా, ఆద్యాతో వచ్చారు. గురువారం మధ్యాహ్నం సుపధం మార్గం ద్వారం కుమారుడు అకీరా నందన్, కుమార్తె ఆద్యతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. 
 
దర్శనం అనంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేయగా... ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా అకీరాను చూసిన వారంతా పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌లా వున్నారని.. బాగా ఎదిగాడని మాట్లాడుకుంటున్నారు. తిరుమల పర్యటనలో పంచెకట్టుతో కనిపించిన అకీరా నందన్.. తన తండ్రి పవన్ కల్యాణ్ మాదిరిగానే ఉన్నారని ఫ్యాన్స్ అంటున్నారు. ఆద్య కూడా తండ్రికి తగిన తనయగా పుత్తడి బొమ్మలా వుంది. 
'
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాదంబరి జెత్వానీ కేసు.. ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులకు నోటీసులు

YS Sharmila: గృహ నిర్భంధంలో షర్మిల - పోలీసులకు నన్ను ఆపే హక్కు లేదు

Pawan Kalyan: సింహాచలం ఘటనపై పవన్ దిగ్భ్రాంతి.. అండగా వుంటామని హామీ

వేసవి రద్దీ - తిరుపతికి 8 ప్రత్యేక రైళ్ళు : దక్షిణ మధ్య రైల్వే

సింహాచలం ఘటన : మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు - సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments