Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీదేవి అంతియ యాత్ర ప్రారంభం : ప్రభుత్వ అధికార లాంఛనాలతో

నటి శ్రీదేవి అంతిమ యాత్ర బుధవారం మధ్యాహ్నం ప్రారంభమైంది. ముంబైలోని హిందూ శ్మశానవాటికలో మధ్యాహ్నం 3.30 నిమిషాలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సెలబ్రేషన్ స్పోర్ట్స్ క్లబ్‌లో ఆమె మృతదేహన్ని అభిమానుల స

Webdunia
బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (14:31 IST)
నటి శ్రీదేవి అంతిమ యాత్ర బుధవారం మధ్యాహ్నం ప్రారంభమైంది. ముంబైలోని హిందూ శ్మశానవాటికలో మధ్యాహ్నం 3.30 నిమిషాలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సెలబ్రేషన్ స్పోర్ట్స్ క్లబ్‌లో ఆమె మృతదేహన్ని అభిమానుల సందర్శనార్థం ఉంచారు. శ్రీదేవికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. దీని కోసం మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. సెలబ్రేషన్ స్పోర్ట్స్ క్లబ్‌కు ముంబై పోలీస్ బ్యాండ్ అధికార లాంఛలాలను పూర్తి చేసింది. 
 
మరోవైపు, ముంబైలో శ్రీదేవి నివాసం ఉండే గ్రీన్ యాక్రెస్ ప్రాంత వాసులు తమ అభిమాన నటికి ఘన నివాళి అర్పించారు. శ్రీదేవి మృతికి సంతాపంగా మార్చి 2న హోలీ వేడుకలను రద్దు చేస్తూ గ్రీన్ యాక్రెస్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది 'మా సభ్యురాలు శ్రీదేవి విషాద మరణం నేపథ్యంలో, తన నటనతో మాకు వినోదాన్ని పంచిన ఆమె ఆత్మకుగౌరవ సూచకంగా మార్చి 2న హోలీ వేడుకలను రద్దు చేయాలని నిర్ణయించాం. దీంతో ఆ రోజు సంగీతం, రెయిన్ డ్యాన్స్, రంగు నీళ్లు చిమ్ముకోవడాలు వంటివి ఏవీ ఉండవు' అంటూ సొసైటీ ఓ అధికారిక ప్రకటనలో పేర్కొంది.  

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments