Webdunia - Bharat's app for daily news and videos

Install App

"తొంగి తొంగి చూడమాకు చందమామ" సెన్సార్ పూర్తి, విడుదలకు సిద్ధం

Webdunia
గురువారం, 12 నవంబరు 2020 (18:10 IST)
దిలీప్, శ్రావణి జంటగా నటించిన సినిమా "తొంగి తొంగి చూడమాకు చందమామ". ఈ చిత్రంలో కుమర్ సాయి, రాజ్ బాలా, జెమినీ సురేష్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. "తొంగి తొంగి చూడమాకు చందమామ" చిత్రానికి ఆనంద్ కానుమోలు దర్శకత్వం వహించారు. గురురాఘవేంద్ర సమర్పణలో హరివల్లభ ఆర్ట్స్ సంస్థ నిర్మించింది. ఎ. మోహన్ రెడ్డి నిర్మాత. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన "తొంగి తొంగి చూడమాకు చందమామ" సినిమా యూఏ సర్టిఫికెట్ తో సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది.
 
ఈ సందర్భంగా దర్శకుడు ఆనంద్ కానుమోలు మాట్లాడుతూ, కోరుకున్న వాళ్లను దక్కించుకోవాలంటే ప్రేమించడం ఒక్కటే మార్గం. ప్రేమించడం వల్లే వారి విలువ కూడా తెలుస్తుందనే చెప్పే చిత్రమిది. యువతకు నచ్చే సన్నివేశాలతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు నచ్చే అంశాలు చిత్ర కథలో ఉంటాయి. వినోదం, సందేశం రెండూ సినిమాలో చూపిస్తున్నాం.
 
సెన్సార్ సభ్యులు కూడా సినిమా బాగుందంటూ అభినందించారు. సెన్సార్ నుంచి యూఏ సర్టిఫికెట్ ఇచ్చారు. మా సినిమా టీజర్, సాంగ్స్ చూసి భారీగా చిత్రాన్ని విడుదల చేసేందుకు ముందుకొచ్చిన డిస్ట్రిబ్యూటర్స్‌కి కృతజ్ఞతలు. త్వరలో ఆడియో, ట్రైలర్ రిలీజ్ చేసి డిసెంబర్‌లో చిత్రాన్ని థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అన్నారు.
 
అనంత్, కార్తీక్ అయినాల, అపర్ణ, స్నేహల్, మాధవిప్రసాద్, లావణ్య, మహేంద్రనాథ్, వింధ్య వాసిని రెడ్డి ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఎడిటింగ్: ఈశ్వర్ 57, ఫైట్స్: రియల్ సతీష్, కొరియోగ్రఫీ: శ్రీనివాస్ . కె, వినయ్, పాటలు: బాలాజీ, సంగీతం: హరి గౌర, కెమెరా: వివేక్ రఫీ. ఎస్.కె, నిర్మాత: ఎ. మోహన్ రెడ్డి, రచన, దర్శకత్వం: ఆనంద్ కానుమోలు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments