Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి కిలిక్కి భాషలో స్మిత పాట: వీడియో సాంగ్ అదుర్స్!

Webdunia
గురువారం, 24 డిశెంబరు 2015 (09:31 IST)
బాహుబలి సినిమా, అందులో నటుడు ప్రభాకర్ మాట్లాడే కిలిక్కి భాష ఎంత ఫేమస్ అయిందో తెలిసిందే. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద వాళ్ళ వరకు అందరు ఈ కిలిక్కి భాషను ఎంజాయ్‌ చేశారు. అయితే తాజాగా సింగర్‌ స్మిత ఈ కిలిక్కి భాషను ఆధారంగా చేసుకొని ఓ వీడియో పాటను కంపోజ్‌ చేశారు. ఎం.ఎం.కీరవాణి ఈ పాటను బుధవారం హైదరాబాద్‌లో రిలీజ్‌ చేశారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్మిత ఎంతో నిజాయితీగా, తపనతో వర్క్‌ చేస్తుంది. తన ఫ్యామిలీ కూడా మంచి సపోర్ట్‌ ఇస్తుంది. ఈ సాంగ్‌ మంచి హిట్‌ కావాలని కోరుకుంటున్నానని' చెప్పారు. అనంతరం స్మిత తెలుపుతూ.. బాహుబలి సినిమా చూసిన తరువాత కిలిక్కి భాషలో ఓ వీడియో సాంగ్‌ చేయాలనే ఆలోచన వచ్చింది. వెంటనే బాహుబలి కిలిక్కి భాషకు మాటలు అందించిన మదన్‌ కార్కిని సంప్రదించాను.

నేను అడిగిన రెండు రోజుల్లోనే తను పాట లిరిక్స్‌ అందించారు. ఆ పాటకు బాస్కో కోరియోగ్రఫీ అందించడం ఎప్పటికి మర్చిపోలేను. నిజానికి ఈ పాట ఇదివరకే విడుదల చేయాల్సింది కాని చెన్నై వరదల కారణం పోస్ట్‌ పోన్‌ చేశాం. ఈ పాట కోసం నాకు హెల్ప్‌ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్‌'' అని చెప్పారు.
 
మదన్‌ కార్కి మాట్లాడుతూ.. బాహుబలి సినిమా చేసేప్పుడు రాజమౌళి గారికి కిలిక్కి భాషలో పాట ఉంటే బావుంటుందని చెప్పాను. కాని స్పేస్‌ లేక సాంగ్‌ పెట్టడం కుదరలేదు. స్మిత గారు వచ్చి కిలిక్కి భాషలో పాట చేయాలనగానే సంతోషంగా అనిపించింది. ఈ సాంగ్‌ పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో మెహర్‌ రమేష్‌, శోభు యార్లగడ్డ, నోయల్‌ తదితరులు పాల్గొన్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments